Site icon HashtagU Telugu

Dream Job: వెరైటీ జాబ్ : “ఏం చేయడు” అదే అతడి ఉద్యోగం.. విశేషాలివీ!!

Japanese Boy Imresizer

Japanese Boy Imresizer

అతడి జాబ్ వెరీ వెరీ స్పెషల్. ఒంటరిగా జీవించే వాళ్ళకు తోడుగా, నీడగా ఉండటమే అతడి జాబ్. డబ్బులు తీసుకొని తోడుగా వచ్చే అతగాడి పేరు షోజీ మోరిమోటో (38). జపాన్ రాజధాని టోక్యోవాసి. మోరిమోటో తొలుత ఓ కంపెనీలో జాబ్ చేసేవాడు. కానీ అతడికి ఆ జాబ్ నచ్చలేదు. దీంతో
కష్టపడకుండా డబ్బులు సంపాదించడం ఎలా ? అని మోరిమోటో సీరియస్ గా ఆలోచించాడు. ‘‘ఒంటరి వాళ్లకు నేను తోడుగా ఉంటా’’ అని ప్రకటించాడు.నెమ్మదిగా అతడి గురించి జనాలకు తెలిసిపోయింది. ఒంటరిగా ఉండే వాళ్లు సరదాగా బయటకు వెళ్లేందుకు అతడిని తోడు తీసుకెళ్లడం మొదలు పెట్టారు. వారితో గడిపేందుకు మోరిమోటో గంటకు 10,000 యెన్‌లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.5,600 వసూలు చేస్తున్నాడు. ఇలా సంపాదించిన డబ్బుతో అతడు తన భార్య , బిడ్డకు పోషించుకుంటున్నాడు. మోరిమోటో కు ఇప్పుడు ట్విట్టర్‌లో దాదాపు పావు మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.

ఇప్పటి వరకు 4 వేల మందితో..

“నన్ను చాలా మంది అద్దెకు తీసుకుంటారు. నా క్లయింట్స్  వారితో పాటు గడిపేందుకు తీసుకెళ్తారు. జస్ట్ నేను వారితో వెళ్తాను. వారు నాకు ఏ పని చెప్పకూడదనేని రూల్.  గత నాలుగు సంవత్సరాలలో అతడు దాదాపు 4,000 మందికి తోడుగా వెళ్లాడు. వారిలో నాలుగింట ఒక వంతు మంది రిపీట్ క్లయింట్స్” అని మోరిమోటో వెల్లడించాడు. మోరిమోటో కేవలం జపాన్ లోని  క్లయింట్స్ వెంటే వెళ్తాడు. ఇతర దేశాల నుంచి ఆఫర్లు వచ్చినా తను వాటిని తిరస్కరించాడు. లైంగిక స్వభావం కలిగిన ఎలాంటి రిక్వెస్ట్ ను తను యాక్సెప్ట్ చేయడు. తాజాగా 27 ఏళ్ల డేటా అనలిస్ట్ అరుణా చిడా చీర కట్టుకుని మోరిమోటోతో బయటకు వచ్చింది. రెస్టారెంట్ లో కూర్చుని తనతో టీ తాగడంతో పాటు కేక్ ల గురించి మాట్లాడింది. అరుణా చిడాకు చీర కట్టుకుని టోక్యో వీధుల్లో తిరగాలని ఉండేది. కానీ, తన మిత్రులు ఇబ్బంది పడతారని భావించిన అద్దె వ్యక్తితో బయటకు వచ్చింది. తనకు నచ్చిన చీర ధరించి వీధుల్లో సరదాగా గడిపింది.