Iranian footballer: సంచలన నిర్ణయం.. ఆ దేశ ఆటగాడికి మరణ శిక్ష

ఇరాన్ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమీర్ నసర్ అజాదాని (Amir Nasr-Azadani) అనే 26 ఏళ్ల ప్రొఫెషనల్ ఇరాన్ ఫుట్‌బాల్ ప్లేయర్ (Iranian footballer)కు మరణ శిక్ష విధించింది. మహిళా హక్కుల కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నాడనే కారణంతో అతడికి మరణ శిక్ష విధించింది. గాయం కారణంగా అమీర్ (Amir Nasr-Azadani) కొంతకాలంగా ఫుట్ బాల్ మ్యాచులు ఆడటం లేదు.

  • Written By:
  • Publish Date - December 14, 2022 / 10:24 AM IST

ఇరాన్ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమీర్ నసర్ అజాదాని (Amir Nasr-Azadani) అనే 26 ఏళ్ల ప్రొఫెషనల్ ఇరాన్ ఫుట్‌బాల్ ప్లేయర్ (Iranian footballer)కు మరణ శిక్ష విధించింది. మహిళా హక్కుల కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నాడనే కారణంతో అతడికి మరణ శిక్ష విధించింది. గాయం కారణంగా అమీర్ (Amir Nasr-Azadani) కొంతకాలంగా ఫుట్ బాల్ మ్యాచులు ఆడటం లేదు. అయితే సెప్టెంబర్ లో మహ్స అమిని అనే 22 ఏళ్ల యువతిని హిజాబ్ సరిగ్గా ధరించలేదన్న కారణంతో మోరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పొలీసుల కస్టడీలో ఆ యువతి అనుమానాస్పదంగా మరణించింది.

దీంతో మహిళా హక్కులపై పలు సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఇది పలు చోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇద్దరు సైనికులు, ఓ గార్డ్ కూడా చనిపోయారు. ఈ ఘటనకు తానే కారణమని ఫుట్‌బాల్ ప్లేయర్ అమీర్ ఒప్పుకోవడంతో మరణశిక్ష విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలలుగా దేశాన్ని కదిలించిన నిరసనలకు సంబంధించి ఇరాన్ ఫుట్‌బాల్ ఆటగాడు అమీర్ నాస్ర్-అజాదానీకి మరణశిక్ష విధించే ప్రమాదం ఉందని ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల ప్రపంచ యూనియన్ FIFPRO కూడా తెలిపింది.

అదే సమయంలో నవంబర్ 17న చంపబడిన కల్నల్ ఇస్మీ, ఇద్దరు బాజీజ్ సభ్యుల హత్యకు అమీర్‌కు మరణశిక్ష విధించడానికి రెండవ కారణం కూడా. దీని తర్వాత అమీర్ నవంబర్ 20న బుల్లితెరపైకి వచ్చి అంగీకరించాడని కూడా వార్తలు వచ్చాయి. ముగ్గురు వ్యక్తులు హత్యకు గురైన ప్రదేశంలో అమీర్ లేడని కూడా వార్తలు వచ్చాయి.

Also Read: Gujarat: గుజరాత్‌లో దారుణం.. పసికందును బిల్డింగ్ పైనుంచి పడేసిన బాలిక