Site icon HashtagU Telugu

Heaviest Fish : ప్రపంచంలోనే అత్యంత బరువైన చేప…దాని బరువు ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..!!

Fish

Fish

సముద్రంలో ఎన్నో రకాల చేపలు ఉంటాయి. అందులో పెద్దవి..చిన్నవి ఉంటాయి. కొన్ని పరిమాణంలో పెద్దవిగా ఉంటే..కొన్ని బరువుతో ఉంటాయి. అయితే సముద్రంలో కనిపించే అతిపెద్ద చేప వేల్ షార్క్. కానీ దానికంటే అత్యంత బరువైన పరిమాణంలో పెద్ద చేప ఉందనే విషయం మీకు తెలుసా. జెయింట్ హెలీ మోలా…ఈ చేప ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైంది. దీని బరువు 2,744కిలోలు. ఈ చేప బండ రాయిలా కనిపిస్తుంది. దాని లార్వాలను చూస్తే షాక్ అవుతారు. ఈ చేప ఎంత వింతగా కనిపిస్తుందో…దాని లార్వా అంత అందంగా ఉంటుంది. దీన్ని సన్ ఫిష్, మోలా అని కూడా పిలుస్తారు. దీని పొడవు కనీసం 3మీటర్ల కంటే ఎక్కువగానే ఉంటుంది.

ఈ చేపలో మూడు జాతులు ఉన్నాయి. ఓషన్ సన్ పిష్, జెయింట్ సన్ ఫిష్, హుడ్ వింకర్ సన్ ఫిష్. ఇవి సముద్రం ఉపరితంలో ఉంటాయి. చూడానికి అచ్చం బండరాయిలా కనిపిస్తాయి. డిసెంబర్ 2021లో పోర్చుగల్లోని అజోర్స్ ద్వీపసమూహంలో జెయింట్ సన్ ఫిష్ మరణించింది.దీన్ని ఫోర్క్ లిఫ్ట్ ట్రక్కు సహాయంతో తూకం వేశారు. దాని తర్వాత జెయింట్ హెలీ మోలా ప్రపంచంలోనే అత్యంత బరువైన అస్థి చేపగా అవతరించింది.