Site icon HashtagU Telugu

US Crisis: యూఎస్ లో పెరుగుపోతున్న నిరాశ్రయులు.. సంక్షోంభంలో నిరుపేదలు

Homeless

Homeless

US Crisis: యూఎస్ అనగానే పెద్ద పెద్ద బిల్డింగ్, కమర్షియల్ ఆఫీసులు, బహుళ అంతస్థులు గుర్తుకురావడం చాలా కామన్. కానీ మరోవైపు చూస్తే ఎక్కడిచూసినా నిరుపేదలు కనిపిస్తున్నారు. రోడ్డుపక్కల షెల్టర్స్ వేసుకొని ఆశ్రయం పొందుతున్నారు. USలో నిరాశ్రయులైన వారి సంఖ్య రికార్డు స్థాయిలో 12 శాతం పెరిగిందని కొత్త ప్రభుత్వ నివేదిక వెల్లడించింది.

జనవరిలో దేశవ్యాప్తంగా సుమారు 653,000 మంది ప్రజలు నిరాశ్రయులైనట్లు జిన్హువా వార్తా సంస్థ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్ మెంట్ సంచలన విషయాలను బయటపెట్టింది. ఇది ఒక సంవత్సరం క్రితం కంటే 70,650 ఎక్కువ మరియు 2007లో సర్వే ప్రారంభమైనప్పటి నుండి అత్యధిక సంఖ్యను సూచిస్తుంది. అమెరికా జనాభాలో ఆఫ్రికన్-అమెరికన్లు 13 శాతం మంది ఉన్నారు.

అయితే మొత్తం నిరాశ్రయులలో 37 శాతం ఉన్నారని నివేదిక పేర్కొంది. 2022 నుండి 2023 వరకు 28 శాతంగా నిరాశ్రయుల సంఖ్యతో నిండిపోయిందని వెల్లడించింది. కుటుంబ నిరాశ్రయుల సంఖ్య కూడా 16 శాతం పెరిగింది, ఇది 2012 నుండి తగ్గుముఖం పట్టింది. పెరుగుతున్న అద్దెలు, కరోనావైరస్ మహమ్మారి సహాయంలో క్షీణత USలో నిరాశ్రయుల సంక్షోభం వెనుక ఉన్న ప్రధాన కారకాల్లో ఒకటి.