Site icon HashtagU Telugu

America : ఉత్తర అమెరికాలో శ్రీవేంకటేశ్వరస్వామి గోపురం ప్రారంభం..!! సంతోషంలో హిందువులు..!!

America

America

ఈ ఏడాది దీపావళి పండగను పురస్కరించుకుని అమెరికాలోని నార్త్ కరోలినాలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన 87అడుగుల గోపురంను ప్రారంభించారు. వందలాదిమంది భక్తుల సమక్షంలో ఈ గోపురాన్ని నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్ ప్రారంభించారు. గోపురం ప్రారంభోత్సవంతో అక్కడున్న హిందూవులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ గేట్‌వే టవర్‌కి ‘టవర్ ఆఫ్ యూనిటీ అండ్ ప్రోస్పెరిటీ’ అని పేరు పెట్టారు. శ్రీ వేంకటేశ్వర దేవాలయం ఉత్తర అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయంగా పేరొందింది. గవర్నర్ కూపర్ మాట్లాడుతూ ‘కష్టకాలంలో ఎంత అద్భుతమైన రోజు అని అన్నారు.

ఆలయ ధర్మకర్తల మండలి ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ శ్రీనివాసన్ మాట్లాడుతూ, 2019లో గోపురానికి ఆమోదం లభించిందని తెలిపారు. 2020 ఏప్రిల్‌లో నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. నార్త్ కరోలినాలోని ట్రయాంగిల్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయుల కోరిక మేరకు 1988లో శ్రీ వేంకటేశ్వర ఆలయం ఉనికిలోకి వచ్చిందని తెలిపారు. దక్షిణ భారత దేవాలయాల వైభవాన్ని, చక్కని వివరణాత్మక కళాకృతిని పునరుత్పత్తి చేయాలని కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర దేవాలయం తరహాలో ఈ ఆలయం నిర్మించబడినట్లుగా లక్ష్మీనారాయణ శ్రీనివాసన్ వెల్లడించారు.