Crypto King: ప్రజలను నిండా ముంచి ప్రైవేట్ జెట్ కొన్న క్రిప్టో కింగ్.. బయటపడిన కిడ్నాప్ డ్రామా?

మామూలుగా ఏదైనా వ్యసనానికి అలవాటు పడితే దాని కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు కొందరు మోసగాళ్లు .

  • Written By:
  • Updated On - May 5, 2023 / 02:51 PM IST

Crypto King: మామూలుగా ఏదైనా వ్యసనానికి అలవాటు పడితే దాని కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు కొందరు మోసగాళ్లు . చంపడం కానీ, ఇతరులను మోసం చేయటం కానీ ఇంకేమైనా పనులు చేయడానికి అయినా సిద్ధమవుతూ ఉంటారు. ఇప్పటికే ఇటువంటి మోసాలకు పాల్పడిన వాళ్ళు చాలామంది వెలుగులోకి వచ్చారు.

అయితే ఇటువంటిదే ఒక వార్త ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతుంది. కెనడాలో ఐడెన్ ఫ్లైటర్ స్కై అనే క్రిప్టో కింగ్ ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున మోసం చేసి లగ్జరీ లైఫ్ గడుపుతున్నట్లు తెలిసింది. ఇక ఇప్పటికే అతనిపై టోరంటోలో ఒక కేసు కూడా నడుస్తుందని.. ఇక అధికారులు ఇతని దగ్గర నుంచి మిలియన్ డాలర్లను తిరిగి వసూలు చేయడానికి బాగా ప్రయత్నిస్తున్నారు అని తెలిసింది.

ఇక ఇతడు లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి ఏకంగా ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 40 మిలియన్ల డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం 330 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసి అందులో ఆరు కోట్లు మాత్రమే పెట్టుబడులకు పెట్టినట్లు కెనడాలోని బ్యాంక్ రప్టసీ ట్రస్ట్ తెలిపింది. అంతేకాకుండా గత ఏడాది డిసెంబర్ లో దక్షిణ ఒంటారియా కు చెందిన దుండగులు తనను కిడ్నాప్ చేశారు అని..

అక్కడే మూడు రోజులు బంధించి మూడు మిలియన్ల డాలర్లు ఇవ్వాలని చిత్రహింసలు పెట్టారని అతని తండ్రి తెలిపినట్లు తెలిసింది. అయితే ఇదంతా డ్రామా అని అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే అతని దగ్గర ఖరీదైన లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అతడు డబ్బులు చెల్లిస్తాడా.. చెల్లించడ.. అని ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. మరి కెనడా ప్రభుత్వం ఐడెన్ నుంచి ఇన్వెస్టర్లకు డబ్బులు అందజేసేలా చేస్తారో లేదో చూడాలి.