Prince Williams Affair : యువరాణి మిస్సింగ్.. యువరాజు అఫైర్ వ్యవహారం తెరపైకి ?

Prince Williams Affair : కేట్‌ మిడిల్టన్‌.. ఈమె బ్రిటన్‌లోని వేల్స్ ప్రాంత యువరాణి !!

Published By: HashtagU Telugu Desk
Prince Williams Affair

Prince Williams Affair

Prince Williams Affair : కేట్‌ మిడిల్టన్‌.. ఈమె బ్రిటన్‌లోని వేల్స్ ప్రాంత యువరాణి !! బ్రిటన్‌  యువరాజు విలియం సతీమణి !! ఆ రాజ కుటుంబంలో ఏది జరిగినా మిస్టరీయే ? అంత త్వరగా ఏ విషయమూ బయటకు పొక్కదు. అనారోగ్యం వల్ల కేట్‌ మిడిల్టన్‌  ఒక సర్జరీ చేయించుకున్నారని ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం ఈ ఏడాది జనవరిలో ఓ ప్రకటన విడుదల చేసింది.  ఆ తర్వాతి నుంచి ఆమె బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. దీంతో కేట్ కోమాలోకి వెళ్లి ఉండొచ్చనే ప్రచారం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join

ఈ క్రమంలోనే బ్రిటన్‌లో మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ ఓ ఫొటో విడుదల చేసింది. తీరా దాన్ని చెక్ చేస్తే.. అది ఎడిటెడ్ ఫొటో అని వెల్లడైంది. దీంతో ప్రిన్స్‌ అండ్ ప్రిన్సెస్‌ ఆప్‌ వేల్స్ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా కేట్‌ వివరణ ఇచ్చుకున్నారు. ‘‘ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ల వల్ల నేను కూడా ఎడిటింగ్‌లో ప్రయోగాలు చేస్తుంటాను. నిన్న మేం షేర్ చేసిన ఫొటో వల్ల కలిగిన గందరగోళానికి క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అని పోస్టు పెట్టారు. అయితే ఆ ట్వీట్ కేట్ చేసిందా ? ఇంకెవరైనా చేశారా ? అనే సందేహాలు కూడా రేకెత్తాయి. దీంతో యువరాణి కేట్‌ మిడిల్టన్‌‌కు ఏమైంది ? అనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి.ఈనేపథ్యంలో  యువరాజు విలియంకు ఓ యువతితో ఉన్న అఫైర్(Prince Williams Affair) అంశం బ్రిటన్ మీడియాలో తెరపైకి వచ్చింది. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read : YS Sunitha Reddy : హంతకుల పక్షాన ఉంటారా ? బాధితుల పక్షాన ఉంటారా ? : వైఎస్ సునీతారెడ్డి

బ్రిటన్ యువరాజు విలియం అఫైర్ కలిగిన ఆ యువతి పేరు సారా రోజ్ హాండ్బరీ అని తెలుస్తోంది. బ్రిటన్ రాజ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న ఓ ఫ్యామిలీలో ఆమె పుట్టారని అంటారు. దీంతో బాల్యం నుంచే సారా రోజ్ హాండ్బరీకి, విలియంకు మంచి సాన్నిహిత్యం ఉందని చెబుతుంటారు. వారి ఇళ్లు కూడా దగ్గర దగ్గరే ఉంటాయని బ్రిటన్ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. విలియం, సారా మధ్య అఫైర్ ఉందని తొలిసారిగా 2019 సంవత్సరంలో ప్రచారం జరిగింది. తాజాగా బ్రిటన్‌కు చెందిన ఒక టాక్‌ షోలో కమెడియన్ స్టీఫెన్ కోల్బర్ట్ చేసిన జోక్‌తో.. ఈ ఇద్దరి మధ్య ఉన్న రహస్య బంధం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ‘‘కేట్ అదృశ్యంతో ఈ రాజ్యం అల్లకల్లోలమవుతోంది. కొందరు నెటిజన్లు ఇందుకు విలియం అఫైర్ కారణమని భావిస్తున్నారు. ఆ మహిళ ఎవరో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను’’ అని పేర్కొంటూ గతంలో వచ్చిన వార్తలను స్టీఫెన్ కోల్బర్ట్ ఈ టాక్ షోలో ప్రస్తావించారు. గతంలో ఇదే విషయాన్ని కేట్ ప్రస్తావించగా.. విలియం నవ్వుతూ కొట్టిపారేశాడని కామెంట్ చేశాడు. భార్య ప్రశ్నించినప్పుడు ‘నవ్వేయడం’ మంచి సమాధానం అని స్టీఫెన్ కోల్బర్ట్ పేర్కొన్నాడు.

  Last Updated: 15 Mar 2024, 04:10 PM IST