Site icon HashtagU Telugu

Trump Team Assets: ట్రంప్ అండ్ టీమ్ ఆస్తులు రూ.32.41 లక్షల కోట్లు.. 172 దేశాల జీడీపీ కంటే ఎక్కువే!

Trump Team Assets Trumps Office Members Us Cabinet Billionaires 172 Countries Gdp

Trump Team Assets: జీడీపీ అంటే.. స్థూల దేశీయ ఉత్పత్తి.  ఇది ప్రతీ దేశపు ఆర్థిక అభివృద్ధి ప్రయాణానికి ప్రమాణం. ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం తమ జీడీపీ వివరాలను ప్రకటిస్తుంటాయి. ప్రపంచంలోని 172 దేశాల జీడీపీ కంటే అమెరికాలో కొలువుతీరనున్న డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వ కార్యవర్గంలోని ముఖ్యుల ఆస్తుల విలువే ఎక్కువట!! ట్రంప్ ప్రభుత్వంలో ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ’ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అధిపతిగా అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు బాధ్యతలను అప్పగించారు. ఎలాన్ మస్క్ వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు రూ.32 లక్షల కోట్లు.

Also Read :Delhi Polls 2025 : కాంగ్రెస్‌తో పొత్తుకు కేజ్రీవాల్‌ నో.. ఎందుకు ?

కొత్తగా ఏర్పడబోయే రిపబ్లికన్ పార్టీ సర్కారులోని ఇతర శ్రీమంతుల ఆస్తులన్నీ కలుపుకుంటే.. ట్రంప్ క్యాబినెట్ సభ్యులందరి మొత్తం ఆస్తుల విలువ రూ.32.41 లక్షల కోట్లకు చేరుతుంది. ప్రపంచంలోని 172 దేశాల జీడీపీలు అన్నీ కలుపుకున్నా.. ఇంతకు విలువ చేయవు. ఇక 2016 సంవత్సరంలో అమెరికాలో ఏర్పడిన ట్రంప్‌ ప్రభుత్వ మంత్రిమండలిలోని సభ్యుల ఆస్తుల విలువ కేవలం రూ.52వేల కోట్లే. ఎలాన్ మస్క్ చేరికతో డొనాల్డ్ ట్రంప్ టీమ్(Trump Team Assets) మునుపటి కంటే చాలా స్ట్రాంగ్ అయింది. ఎన్నికల టైంలోనూ ట్రంప్ ప్రచారానికి వేల కోట్ల విరాళాలను ఎలాన్ మస్క్ అందజేశారు.  ఇక డొనాల్డ్‌ ట్రంప్‌ సాదాసీదా వ్యక్తేం కాదు. ఆయనకు రియల్‌ ఎస్టేట్‌, హోటల్స్‌, సోషల్‌ మీడియా వ్యాపారాలు ఉన్నాయి. ట్రంప్‌కు దాదాపు  రూ.52వేల కోట్ల సంపద ఉంది.

Also Read :Samantha Prayer 2025 : నూతన సంవత్సరంలో ప్రేమించే భాగస్వామి, పిల్లలు.. సమంత పోస్ట్‌ వైరల్‌