Thailand PM : ఏకంగా ప్రధానమంత్రిపైనే కోర్టు వేటు వేసింది. ఈ సంచలన పరిణామం థాయ్‌లాండ్(Thailand PM) దేశంలో చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రి స్రెట్టా థావిసిన్‌ను పదవి నుంచి తప్పిస్తూ అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ ప్రధానమంత్రి పదవిలో ఉన్న ఆయన నైతిక ఉల్లంఘనలకు పాల్పడినట్లు రుజువు కావడంతో ఈమేరకు చర్యలు తీసుకుంది.ఈ ఆదేశాలు వెంటనే అమలవుతాయని, ప్రధాని పదవి నుంచి స్రెట్టా థావిసిన్ తప్పుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. దేశానికి కొత్త ప్రధాని నియామక ప్రక్రియకు పార్లమెంటు పచ్చజెండా ఊపేవరకు ఆపద్ధర్మ పద్ధతిలో ప్రస్తుత కేబినెట్ కొనసాగుతుందని కోర్టు తెలిపింది. అయితే ఎప్పటిలోగా కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకుంటారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
We’re now on WhatsApp. Click to Join
థాయ్‌లాండ్ మంత్రి పిచిత్ చుయెన్‌బాన్ ఓ కేసులో దాదాపు 6 నెలలు జైలుశిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయనను ప్రధానమంత్రి స్రెట్టా థావిసిన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఊరుకోలేదు. ఆ తర్వాత పిచిత్ చుయెన్‌బాన్‌పై ఉన్న కేసుకు సంబంధించి.. 2008లో ఓ న్యాయమూర్తికి 55వేల డాలర్లు లంచం ఇచ్చేందుకు స్రెట్టా థావిసిన్ యత్నించారనే అభియోగాలు ఉన్నాయి. ఇవి రుజువు కావడంతో రాజ్యాంగ న్యాయస్థానం ఆయనను ప్రధాని పదవి నుంచి తొలగించింది. దేశంలోని ఒక ప్రతిపక్ష పార్టీని రద్దు చేయాలని అక్కడి కోర్టు ఆదేశించిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. నేరచరిత కలిగిన పిచిత్ చుయెన్‌బాన్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవడం, న్యాయమూర్తికి లంచం ఇచ్చేందుకు యత్నించడం ద్వారా స్రెట్టా థావిసిన్ నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారని కోర్టు తాజాగా వ్యాఖ్యానించింది.
Also Read :Coffee Day : కాఫీ డేకు భారీ ఊరట.. దివాలా చర్యలను ఆపాలంటూ ఆదేశాలు
భరతనాట్యంలో చైనా విద్యార్థిని ప్రతిభ
భరతనాట్యానికి చైనాలో కూడా ఆదరణ లభిస్తోంది. అక్కడి విద్యార్థినులు ఎంతోమంది ఈ సంప్రదాయ డ్యాన్స్‌ను నేర్చుకుంటున్నారు. 13 ఏళ్ల లీ ముజి అనే చైనా విద్యార్థిని కూడా ఈ డ్యాన్స్ నేర్చుకొని చరిత్ర సృష్టించింది. బీజింగ్‌లో ఇటీవలే ఆమె గ్రాండ్‌గా ప్రదర్శన కూడా ఇచ్చింది. ఆ ప్రోగ్రాంకు ప్రముఖ భరతనాట్య కళాకారిణి లీలా శాంసన్, భారత దౌత్యవేత్తలు హాజరై ఆమెను అభినందించారు. 13 ఏళ్ల లీ ముజి భరతనాట్యంలో పదేళ్లుగా ట్రైనింగ్ తీసుకుంది. 1999లో ఢిల్లీలో భరతనాట్యం నేర్చుకున్న జిన్ షాన్ షాన్ అనే కళాకారిణి నుంచి సదరు విద్యార్థిని డ్యాన్స్ నేర్చుకుంది.