Transgender Surgeries : మైనర్లకు ట్రాన్స్‌జెండర్ చికిత్సపై బ్యాన్

అమెరికాలోని అతిపెద్ద రాష్ట్రమైన టెక్సాస్ కీలక నిర్ణయం తీసుకుంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి హార్మోన్ బ్లాకర్లను సూచించడం, లింగ పరివర్తన శస్త్రచికిత్సలు చేయకుండా వైద్య నిపుణులను నిలువరించే చట్టానికి(Transgender Surgeries) ఆమోదం తెలిపింది.

  • Written By:
  • Updated On - June 3, 2023 / 02:01 PM IST

అమెరికాలోని అతిపెద్ద రాష్ట్రమైన టెక్సాస్ కీలక నిర్ణయం తీసుకుంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి హార్మోన్ బ్లాకర్లను సూచించడం, లింగ పరివర్తన శస్త్రచికిత్సలు చేయకుండా వైద్య నిపుణులను నిలువరించే చట్టానికి(Transgender Surgeries) ఆమోదం తెలిపింది. ఈ చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని  ప్రకటించింది. దీనికి సంబంధించిన బిల్లుపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ సంతకం చేశారు. దీంతో ఆ రాష్ట్రంలో మైనర్‌లకు లింగమార్పిడి చికిత్సలు చేయడంపై  బ్యాన్ అమల్లోకి రానుంది.

Also read : First Transgender: తొలి ట్రాన్స్‌జెండర్ బాడీబిల్డర్ ప్రవీణ్ నాథ్ ఆత్మహత్య.. కారణమిదేనా..?

గత నెలలోనే (మే) ఇదే అంశంపై(Transgender Surgeries) బిల్లును ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ కు ఆమోదించారు. టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలు అమెరికాలో జనభాపరంగా టాప్ 2, 3 ప్లేస్ లలో ఉన్నాయి. టెక్సాస్ రాష్ట్ర నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో దావా వేస్తామని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ తెలిపింది. “టెక్సాస్‌లో ట్రాన్స్ జెండర్  యువత సంఖ్య  పెరగకుండా గవర్నర్ అబాట్ ఆపలేడు. మేం దీనిపై కోర్టుకు వెళతాం” అని ఆ సంస్థ ట్వీట్‌ చేసింది.

ట్రాన్స్‌జెండ‌ర్ల సాధికారత కోసం రైల్వే 

ఇటీవల గువాహ‌టి రైల్వే స్టేష‌న్‌లో ట్రాన్స్‌జెండ‌ర్ల టీ స్టాల్‌ను ఈశాన్య స‌రిహ‌ద్దు రైల్వే అధికారులు  ప్రారంభించారు. ఈ టీ స్టాల్.. ట్రాన్స్‌జెండ‌ర్ల ఆధ్వ‌ర్యంలోనే న‌డ‌వ‌నుంది.ఇత‌ర రైల్వే స్టేష‌న్ల‌లోనూ ట్రాన్స్‌జెండ‌ర్ల టీ స్టాల్స్‌ను ప్రారంభించి, వారిని ఆర్థికంగా బ‌లోపేతం చేస్తామ‌ని అధికారులు ఆ కార్యక్రమం సందర్భంగా చెప్పారు.