టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే తక్సిమ్ స్క్వేర్ లోని ఇస్టిక్ లాల్ అవెన్యూలో ఆదివారం ఉగ్రదాడి సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు మరణించారు. 81మందికి తీవ్రగాయాలయ్యాయి. అల్ జజీరా ప్రకారం దాడిచేసిన వ్యక్తి పేలుడు పదార్థాలతో నిండిన బ్యాగ్ ను పౌరుల మధ్య పడేశాడు. అతను వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ఈ పేలుడు జరిగింది.
పేలుడు టర్కీ ప్రభుత్వం తీవ్రవాద దాడిగా పరిగణిస్తున్నట్లు ప్రెసిడెంట్ ఫుట్ ఆక్టే వెల్లడించినట్లుగా టర్కీ వార్త సంస్థ అనడోలు పేర్కొంది. ఓ మహిళ ఈ ఉగ్రదాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ పేలుడు వెనక ప్రధాన నిందితురాలిగా మహిళను గుర్తించినట్లు చెప్పారు. అల్ జజీరా నివేదికలో ఒక మహిళ, ఇద్దరు యువకులతో సహా ముగ్గురు ఈ దాడిలో పాల్గొన్నారని మూలాలను ఉటంకిస్తూ పేర్కొంది.
NEW: Footage shows the moment of the explosion in #Istanbul pic.twitter.com/4m8bvnve44
— i24NEWS English (@i24NEWS_EN) November 13, 2022
కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి చెందిన మహిళగా అనుమానిస్తున్నారు అధికారులు. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ అనేది కుర్దిష్ తీవ్రవాద వామపక్ష సంస్థ. ఇది ప్రధానంగా ఉత్తరఇరాక్, ఆగ్నేయ టర్కిలో తన కార్యకలాపాలను విస్తరించింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఈ మహిళను గుర్తించారు. ఇస్తాంబుల్ ఉగ్రఘటనకు భారత్, స్వీడన్, ఉక్రెయిన్ సంతాపం వ్యక్తం చేశాయి.
https://twitter.com/shouthaber/status/1591878220915294210?s=20&t=hv_eS665B4L83hCRIgYUFg