Site icon HashtagU Telugu

Russia: రష్యా సైనిక శిబిరంపై ఉగ్రదాడి…కాల్పుల్లో 11మంది సైనికులు మృతి..!!

Russia

Russia

రష్యా సైనిక శిబిరంపైస ఉగ్రదాడి జరిగింది. ఈ కాల్పుల్లో 11మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 15మందికిపైగా సైనికులు గాయపడ్డారు. రష్యా దీనిని ఉగ్రదాడిగా అభివర్ణించింది. ఇద్దరు రష్యా సైన్యంలో వాలంటీర్లుగా పనిచేస్తున్నవారే కాల్పులు జరిపారు. దాడి చేసిన ఇదర్నీ రష్యా మాజీసోవియల్ యూనియన్ పౌరులుగా పేర్కొంది. వారు కూడా కాల్పుల్లో మరణించారు.

వాలంటీర్లుగా జాయిన్ అయిన సైనికులిద్దరూ మిగిలిని సైనికులతో కలిసి కాల్పులు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో ఒక వ్యక్తి ఆకస్మాత్తుగా సైనికులను కాల్చాడు. ప్రతీకారంగా రష్యా సైనికులు వారిద్దర్నీ హతమార్చారు. నైరుతి రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపంది. ఈ నగరం ఉక్రెయిన్ సరిహద్దుకు ఆనుకుని ఉంది. ఈ ఘటనతో ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.