China : జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా చైనాలో ఉద్రిక్త పరిస్థితులు..!!

  • Written By:
  • Updated On - November 28, 2022 / 08:59 AM IST

చైనాలో జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం చైనాలోని ప్రధాన నగరాల్లో వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలు ఆగ్రహాన్ని రేకెత్తించారు. చైనా ప్రభుత్వం అవలంభిస్తున్న కోవిడ్ కఠిన ఆంక్షల వల్ల ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. చాలా మంది స్నాప్ లాక్ డౌన్ లు, సుదీర్ఘమైన నిర్భందాలు, సామూహిక పరీక్షలతో విరక్తి చెందుతున్నారు. లాక్ డౌన్ ఎత్తివేయాలంటూ ఎక్కడిక్కడ ప్రజలు ఆందోళనలు చేపట్టారు.

కాగా వాయువ్య చైనాలోని జిన్ జియాంగ్ ప్రాంతంలో గురువారం ఘోర్ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దీనికి కారణంగా కోవిడ్ లాక్ డౌన్ అంటూ ప్రజలు తీవ్రఆగ్రహానికి గురయ్యారు. కోవిడ్ లాక్ డౌన్ వల్ల రెస్క్యూ టీమ్స్ సమాయానికి ఘటనాస్థలానికి చేరుకోలేకపోయాని ఆరోపించారు. అయితే ఈ వాదనలను అధికారులు ఖండించారు.

ఆదివారం రాత్రి రాజధాని బీజింగ్ లోని నది ఒడ్డున కనీసం 400ల మంది ప్రజలు గూమిగూడి నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ఊపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సుమారు వంద పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రభుత్వం దిగవచ్చి తమ డిమాండ్లను విన్నంచామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు తమ నిరసనను విరమించుకున్నారు.