Nobel Peace Prize: నోబెల్ పీస్ ప్రైజ్ విన్న‌ర్ కు ప‌దేళ్ల జైలుశిక్ష.. ఎందుకంటే?

బెలార‌స్‌కు చెందిన నోబెల్ పీస్ ప్రైజ్ విన్న‌ర్ 60 ఏళ్ల అలెస్ బియాలిస్కీకి ప‌దేళ్ల జైలుశిక్ష విధించారు.

Published By: HashtagU Telugu Desk
Ten Years Imprisonment For Nobel Peace Prize Winner.. Because

Ten Years Imprisonment For Nobel Peace Prize Winner.. Because

బెలార‌స్‌కు చెందిన నోబెల్ పీస్ ప్రైజ్ (Nobel Peace Prize) విన్న‌ర్ 60 ఏళ్ల అలెస్ బియాలిస్కీకి ప‌దేళ్ల జైలుశిక్ష విధించారు. బెలార‌స్‌ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌ల‌ను చేపట్టారనే అభియోగాలతో ఆయ‌న్ను శిక్షించారు. ఈ కేసులో సహ నిందితులు వాలెంటిన్ స్టెఫానోవిచ్‌కు తొమ్మిదేళ్ల జైలు, వ్లాదిమిర్ ల్యాబ్‌కోవిచ్‌కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 2022లో నోబెల్ శాంతి బ‌హుమ‌తిని (Nobel Peace Prize) సంయుక్తంగా గెలుచుకున్న ముగ్గురిలో అలెస్ బియాలిస్కీ ఒక్క‌రు. నోబెల్ అవార్డు గ్ర‌హీత‌ను బెలార‌స్ అధ్య‌క్షుడు అలెగ్జాండ‌ర్ లుక‌షెంకో ఇబ్బంది పెడుతున్న‌ట్లు బియాలిస్కీ మ‌ద్ద‌తుదారులు ఆరోపిస్తున్నారు. 1994లో లుకాషెంకో బెలారస్‌కు మొదటి అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత 1996లో బిలియాట్స్కీ వియాస్నా అనే మానవ హక్కుల సంఘాన్ని స్థాపించాడు. 2011లోనూ పన్ను ఎగవేత అభియోగాలతో బియాలిస్కికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. అయినా ఆయన తన పోరాటాన్ని ఆపలేదు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో యొక్క వివాదాస్పద 2020 ఎన్నికలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మక ప్రదర్శనల తరువాత బియాలిస్కి జైలు పాలయ్యారు. వివాదాస్ప‌ద ఎన్నిక‌ల‌కు వ్య‌తిరేకంగా అలెగ్జాండ‌ర్ లుక‌షెంకో నాయకత్వాన్ని తిరస్కరిస్తూ 2021లో జ‌రిగిన నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌ల స‌మ‌యంలో అలెస్ బియాలిస్కిని అరెస్టు చేశారు. ఈ నిర‌స‌న‌ల కోసం ప్ర‌తిప‌క్షాల‌కు బియాలిస్కి నిధుల‌ను మ‌ళ్లించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2020 నుంచి లుక‌షెంకోకు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న పోరాటాల్లో పాల్గొంటున్న‌ వారిని అరెస్టు చేస్తూనే ఉన్నారు.

పుతిన్‌కు మంచి మిత్రుడు..

బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మంచి మిత్రుడు . 2022 ఫిబ్రవరిలో బెలారస్ నుండి ఉక్రెయిన్‌కు సైనిక దళాలను మోహరించడానికి రష్యాకు హెల్ప్ చేసింది అలెగ్జాండర్ లుకాషెంకోనే.లుకాషెంకో ప్రతిపక్ష ఉద్యమాన్ని అణిచివేశాడు. తన విమర్శకులను జైలులో పెట్టాడు. వారిని ప్రవాసంలోకి నెట్టాడు.

ప్రతిపక్ష నాయకురాలికి 19 ఏళ్ల జైలు శిక్ష విధిస్తే..

లిథువేనియాలో నివసిస్తున్న బెలారస్ బహిష్కృత ప్రతిపక్ష నాయకురాలు స్వెత్లానా టిఖానోవ్‌స్కాయా ఈ నిర్ణయం పై ఆవేదన వ్యక్తం చేశారు. బెలారస్ కోర్టు నిర్ణయాన్ని “నకిలీ విచారణ”గా ఆమె అభివర్ణించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టిఖానోవ్‌స్కాయాకు కూడా బెలారస్ కోర్టు గతంలో 19 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే ఆమె లిథువేనియాలో పారిపోయి అక్కడ తలదాచుకుంటున్నారు.

Also Read:  Aadhaar – PAN: ఆధార్ పాన్ లింకింగ్ కొత్త మినహాయింపు రూల్స్ ఇవే

  Last Updated: 03 Mar 2023, 10:47 PM IST