Site icon HashtagU Telugu

Bangkok: బ్యాంకాక్‌లోని ఓ పాఠశాలలో ఘోర ప్రమాదం.. అగ్నిమాపక పరికరంలో పేలుడు, విద్యార్థి మృతి

Indian Student Dies In US

Crime Imresizer

Bangkok: థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ (Bangkok)లోని ఓ పాఠశాలలో భద్రతా విన్యాసాలు జరుగుతున్న సమయంలో ఘోర ప్రమాదం సంభవించి విద్యార్థి మృతి చెందాడు. దీంతో పాటు పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. వాస్తవానికి అగ్నిమాపక పరికరంలో పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన యువకుడు ఉన్నత పాఠశాల విద్యార్థి స్కూల్‌లో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

బ్యాంకాక్‌లోని ప్రతిష్టాత్మకమైన రాజ్‌వినిత్ మథాయోమ్ స్కూల్‌లో ఔట్‌డోర్ ఫైర్ డ్రిల్ సమయంలో మంటలను ఆర్పే పరికరం పేలడంతో 18 ఏళ్ల ఖుమ్‌తోంగ్ ప్రేమణి మరణించినట్లు పోలీసు కమిషనర్ తితి సెంగ్‌సవాంగ్ ఈ సంఘటనకు సంబంధించి CNNకి తెలిపారు. అగ్నిమాపక కేంద్రం అధికారులు అగ్నిమాపక యంత్రాన్ని ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు బోధిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు

నివేదిక ప్రకారం.. అగ్నిమాపక యంత్రాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. అకస్మాత్తుగా బాంబు పేలుడు వంటి భారీ పేలుడు సంభవించిందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ పేలుడు కారణంగా చనిపోయిన విద్యార్థి ఖుమ్‌తోంగ్ సుమారు 30 అడుగుల దూరంలో పడిపోయాడు. సిలిండర్ ముక్కలు 18 ఏళ్ల విద్యార్థి ఛాతీలోకి వెళ్లాయి. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని యాజమాన్యం తెలిపింది.

Also Read: Donut On Mars : అంగారక గ్రహంపై “వడ”.. ఫోటో తీసి పంపిన నాసా రోవర్

29 మంది గాయపడ్డారు

CNN నివేదిక ప్రకారం.. పేలుడులో మరో 29 మంది గాయపడ్డారు. వీరిలో చాలా మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆ ప్రాంతాన్ని సీలు చేశారు. సేఫ్టీ వాల్వ్ లేకుండా మంటలను ఆర్పే యంత్రాన్ని ఉపయోగించడం వల్లే ప్రమాదం జరిగిందని ఫోరెన్సిక్ అధికారులు తెలిపారు.

ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ఫోరెన్సిక్ అధికారులు ఇంకా మాట్లాడుతూ.. గ్యాస్‌తో నింపబడి చాలా సేపు ఎండలో ఉందని, దాని కారణంగా అది వేడెక్కడం, పేలిపోయిందని చెప్పారు. పోలీసులు పాఠశాలలో ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు కోచ్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి.

Exit mobile version