ప్రపంచవ్యాప్తంగా అనేక సాంకేతిక సంస్థలు ఇంటర్న్ కి ఒక సగటు భారతీయ ఉద్యోగం జీతం కంటే మంచి వేతనాన్ని అందిస్తున్నాయి. మరి ముఖ్యంగా దేశీయ టెక్ దిగ్గజాల సీఈవోలు ఐపిఎల్ ఆటగాళ్లకు లభించే వేతనంతో పోల్చుకుంటే ఎక్కువగానే చెల్లించే కంపెనీలు కూడా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మామూలుగా ఐపీఎల్ ఆటగాళ్లకు వేతనం కోట్లలో ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాంటిది ఐపీఎల్ ఆటగాళ్లకు లభించే వేతనం కంటే సీఈఓ లకు ఎక్కువ శాతాన్ని చెల్లిస్తున్నాయి సదరు కంపెనీలు.
కాగా కంపెనీలను సమీక్షించే ప్లాట్ఫారం గ్లాస్ డోర్ అత్యధిక చెల్లింపు ఇంటర్ షిప్స్ ఇచ్చే టాప్ 25 సంస్థల జాబితాను సిద్ధం చేసింది. విద్యార్థులకు కొత్త గ్రాడ్యుయేట్లకు అలాగే ఇంటర్న్ లకు టాప్ డాలర్లను చెల్లించే కంపెనీలను గుర్తించడంలో సహాయపడటం కోసం అత్యధికంగా చెల్లించే 25 కంపెనీలకు గ్లాస్ డోర్ ఈ ర్యాంకులను ఇచ్చింది.. మరి ముఖ్యంగా గ్లోబల్ అనేక టెక్ ఇతర కంపెనీలో లే ఆఫ్ లు ఆందోళన రేపుతున్న సమయంలో ఇంటర్న్ షిప్ ద్వారా అడుగు పెట్టాలని ఆశించే వారికి ఇది ఊరటనిస్తుందని కంపెనీ తెలిపింది. గ్లాస్ డోర్ యొక్క నివేదిక ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కోకు డిజిటల్ చెల్లింపుల సంస్థ స్ట్రైప్ నీ జాబితాలో టాప్ లో నిలిచింది.
ఇంటర్న్ కు నెలవారీగా 9,064 డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.7.40 లక్షల స్టైఫండ్ ని ఆఫర్ చేసింది. ఆ ప్రకారంగా చూసుకుంటే ఒక ఇంటర్న్ కి ఏడాదికి ఏకంగా రూ.81 లక్షల కంటే ఎక్కువ సంపాదించగలడన్న మాట. కదా మెటా,స్నాప్,టిక్ టాక్ వంటి సామాజిక దిగ్గజాల నుండి స్ట్రైప్ కాయిన్ బేస్ వంటి ఫినిటెక్ కంపెనీల వరకు అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాల దాకా ఈ జాబితాలో 16 టెక్ కంపెనీలు ఆదిపత్యం చెలాయిస్తున్నాయి.