Site icon HashtagU Telugu

H 1B Visa : ట్రంప్ ప్రభుత్వం కొత్త H-1B వీసా విధానం..

H 1b Visa Approach

H 1b Visa Approach

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త H-1B వీసా విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఈ వీసాలు అమెరికాలో ఉన్నత విద్యావంతులైన విదేశీ నిపుణులను దీర్ఘకాలం పనిచేయడానికి అనుమతించే విధంగా ఉంటాయి. అయితే, ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఈ విధానంలో పెద్ద మార్పులు చేసింది. అమెరికా తాత్కాలికంగా విదేశీ నిపుణులను తీసుకువచ్చి, అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇచ్చే విధానం అమలు చేయబోతోంది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, “ఇది ఒక ‘నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్’ ప్రణాళిక” అని తెలిపారు. దీని లక్ష్యం విదేశీ ఆధారాన్ని తగ్గించి, అమెరికా తయారీ రంగాన్ని మళ్లీ బలపరచడమేనని ఆయన వివరించారు.

బెస్సెంట్ మాట్లాడుతూ.. గత 20–30 సంవత్సరాలుగా అమెరికా ప్రెసిషన్ మాన్యుఫాక్చరింగ్ రంగంను విదేశాలకు తరలించిందని, ఇప్పుడు దాన్ని తిరిగి దేశంలోకి తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. “సెమీకండక్టర్ రంగాన్ని మళ్లీ అమెరికాలో ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే అరిజోనాలో భారీ సదుపాయాలు నిర్మాణంలో ఉన్నాయి” అని ఆయన పేర్కొన్నారు. ఈ విధానంలో భాగంగా విదేశీ నిపుణులు మూడు నుంచి ఏడు సంవత్సరాలపాటు అమెరికాలో పనిచేసి, స్థానిక కార్మికులకు శిక్షణ ఇస్తారని చెప్పారు. “తర్వాత వారు తమ దేశాలకు వెళ్లిపోతారు. ఆ తర్వాత అమెరికన్ కార్మికులు ఆ పనులను చేపడతారు” అని బెస్సెంట్ వివరించారు. అమెరికన్ ఉద్యోగాలు కోల్పోతున్నారన్న ఆందోళనలపై స్పందిస్తూ, “ఇప్పుడు ఆ పనులు అమెరికన్లు చేయలేరు కానీ త్వరలో చేయగలుగుతారు” అని అన్నారు.

ట్రంప్ ప్రభుత్వం రూపొందించిన ఈ కొత్త వీసా విధానం, అమెరికా ఆత్మనిర్భరతా ఆర్థిక దిశలో తీసుకున్న కీలక నిర్ణయమని బెస్సెంట్ వివరించారు. ముఖ్యంగా షిప్ బిల్డింగ్, సెమీకండక్టర్, హైటెక్ రంగాల్లో విదేశీ ఆధారాన్ని తగ్గించి దేశీయ తయారీకి ప్రోత్సాహం ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. అలాగే, మధ్యతరగతి కుటుంబాల కోసం $2,000 టారిఫ్ రిబేట్ ఇవ్వాలనే ఆలోచనపై కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది బలమైన వాణిజ్య విధానాల లాభాలు ప్రజలకు చేరేలా చేస్తుందని చెప్పారు. ట్రంప్ ప్రభుత్వ “పారలల్ ప్రాస్పెరిటీ (Parallel Prosperity)” దృష్టికోణం వాల్ స్ట్రీట్ (పెద్ద వ్యాపారాలు) మరియు మెయిన్ స్ట్రీట్ (సాధారణ ప్రజలు) రెండింటి అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్లడమేనని బెస్సెంట్ తెలిపారు. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతూ, ఉద్యోగావకాశాలు విస్తరించనున్నాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

Exit mobile version