Site icon HashtagU Telugu

Teacher Harassment : మైనర్ బాలిక పై టీచర్ వేదింపులు..

Teacher Harassment To Stude

Teacher Harassment To Stude

పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు కామాంధుడిగా మారాడు..మైనర్ బాలిక అని కూడా చూడకుండా నిత్యం ప్రేమ పేరుతో వేధించడం (Teacher Harassment), ప్రేమ లేఖలు రాయడం చేస్తూ వచ్చాడు. టీచర్ టార్చర్ భరించలేక సదరు బాలిక స్కూల్ కు వెళ్లడం మానేసింది. అయినాగానీ వదలకుండా తాను ఉంటున్న చోటకు కూడా వచ్చి వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయం కనిపెట్టిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో రంగంలోకి దిగిన వారు..సదరు టీచర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని సౌత్ కరోలినాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…

సౌత్ కరోలినా (South Carolina)లోని స్టార్ ఎలిమెంటరీ స్కూల్ (Star Elementary School) లో డ్యూక్ (Duke ) అనే వ్యక్తి టీచర్ గా పనిచేస్తున్నాడు. తన స్కూల్ లో చదివే ఓ మైనర్ బాలిక (11)కు ప్రేమిస్తున్నానంటూ ప్రేమ లేఖలు రాయడం..తరుచు బాలిక ఇంటికి వెళ్లడం చేస్తూ వచ్చాడు. బాలిక తల్లిదండ్రులు స్కూల్ టీచర్ అని మాత్రమే తెలియడం తో ఏమి అనలేదు. ఇక రోజు రోజుకు టీచర్ వేదింపులు ఎక్కువ అవుతుండడం తో సదరు బాలిక స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. అయినప్పటికీ వదలకుండా రావడం..బాలిక ఎటు వెళ్తే అటు వెళ్లడం చేస్తుండంతో స్థానికులు గమనించి పోలీసులకు పిర్యాదు చేసారు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని కోర్ట్ లో ప్రవేశ పెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

నిందితుడి తరఫు లాయర్ వాదిస్తూ.. తన క్లయింట్ డ్యూక్ గతేడాది ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నాడని , పర్సనల్ బాండ్, పూచీకత్తుతో విడుదల చేయాలని కోరాడు. అయితే, బాలిక తండ్రి దీనికి అభ్యంతరం చెప్పాడు. డ్యూక్ తన ఇంటికి కూడా తరచూ వచ్చేవాడని, అతడి మనసులోని దురుద్దేశం తెలియక తాము అభ్యంతరం పెట్టలేదని , ఇప్పుడు నిందితుడిని వదిలిపెడితే తమ కూతురికి, తమ కుటుంబానికి హాని తలపెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా, దీనిపై నిందితుడిని జడ్జి హెచ్చరించారు. జైలు నుంచి విడుదల చేస్తే బాలికను కానీ, ఆమె కుటుంబాన్ని కానీ కలిసేందుకు ప్రయత్నించవద్దని వార్నింగ్ ఇచ్చారు.

Read Also :  Donald Trump : హాస్పటల్ నుండి డోనాల్డ్ ట్రంప్ డిశ్చార్జ్‌