పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ (Pawan Kalyan Craze)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో పెద్దగా విజయాలు సాధించకపోయినప్పటికీ ఆయనంటే ప్రత్యర్థులకు భయమే..ఇక పవన్ సినిమాల గురించి చెప్పాల్సిన పన్లేదు. ఆయన ప్లాప్ చిత్రాలు సైతం రికార్డ్స్ తిరగరాసిన చరిత్ర పవన్ కు సొంతం. పవన్ ఎక్కడికెళ్లినా అభిమానులు నీరాజనాలు పలుకుతారు. అందరి హీరోలకు అభిమానులు ఉంటె..పవన్ కళ్యాణ్ కు మాత్రం భక్తులుంటారు. అందుకే పవన్ తో ఓ సినిమా చేసిన చాలని నిర్మాతలు , దర్శకులు కోరుకుంటారు. అది పవన్ రేంజ్.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పుడు ఆ రేంజే పవన్ ను లండన్ మేయర్ ఎన్నికల్లో (London Mayor Elections) సపోర్ట్ చేయాలనే వరకు వచ్చింది. త్వరలో లండన్ మేయర్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, పారిశ్రామికవేత్త తరుణ్ గులాటీ (Tarun Ghulati ) పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన బుధవారం హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షులు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ని కలిశారు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న గులాటీ లండన్ మేయర్ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాల్సిందిగా పవన్ కళ్యాణ్ ని కోరారు. తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ అభిమానులు, జన సైనికులు పెద్ద సంఖ్యలులో ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో పవన్ ఒక్కసారి అక్కడ ప్రచారం చేస్తే బాగుంటుందని తరుణ్ గులాటీ కోరగా..ఆయన అభ్యర్థనను అప్పటికప్పుడూ పవన్ కళ్యాణ్ స్వాగతించారు. భారత సంతతికి చెందిన తరుణ్ గులాటి లండన్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడం సంతోషదాయకం అన్నారు. తన అభిమానులు, జనసేన శ్రేణులతోపాటు తెలుగువారు, భారతీయులంతా ఆయన విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కోరారు. తనను కలసిన గులాటీకి పవన్ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
Read Also : Telangana Polls : జనసేన అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన పవన్