Site icon HashtagU Telugu

Taliban bans women from universities: ఆఫ్ఘన్ యువతులపై మరో నిషేధం.. ఏంటంటే..?

woman study

Cropped

తాలిబాన్లు (Taliban) ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు (Taliban) హస్తగతం చేసుకున్నప్పటి నుంచి మహిళలపై నిషేధాల పర్వం కొనసాగుతోంది. తాజాగా దేశంలోని మహిళలను యూనివర్సిటీ విద్య నుంచి కూడా నిషేధించాలని తాలిబన్లు ఆదేశించారు. ఈ మేరకు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలకు ఉత్తర్వులు జారీ చేశారు. తాలిబన్లు తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని మహిళలను విద్యకు మరింత దూరం చేస్తోందని అక్కడి వారు వాపోతున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ మహిళల హక్కులను అణిచివేసేందుకు తాలిబాన్ ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు మహిళలకు యూనివర్శిటీ విద్యను నిషేధిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై ఉన్నత విద్యాశాఖ మంత్రి నేడా మహ్మద్ నదీమ్ సంతకం చేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు మహిళల విద్యను నిలిపివేయాలని పేర్కొన్న ఆదేశాలను వెంటనే అమలు చేయాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు లేఖలో తెలిపారు. మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జియావుల్లా హషిమీ కూడా లేఖను ట్వీట్ చేశారు. అంతర్జాతీయంగా వస్తున్న నిరసనను పట్టించుకోకుండా తాలిబన్లు మహిళలపై అనేక ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు.

Also Read: China Lemons: నిమ్మకాయలకు ఎగబడుతున్న చైనీయులు.. ఎందుకో తెలుసా

ఇటీవల దేశవ్యాప్తంగా వేలాది మంది బాలికలు, మహిళలు విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు హాజరుకావడంతో ఉన్నత విద్యపై నిషేధం వచ్చింది. చాలా మంది బాలికలు టీచింగ్, మెడిసిన్ రంగంలో కెరీర్ చేయాలని ఆకాంక్షించారు. తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత ప్రత్యేక తరగతులు, బాలికలకు ప్రవేశాలతో సహా కొత్త నిబంధనలను అమలు చేయాలని విశ్వవిద్యాలయాలను కోరింది. ఆఫ్ఘనిస్తాన్‌లో అనేక ప్రభుత్వ ఉద్యోగాల నుండి మహిళలు తొలగించబడ్డారు. మగ తోడు లేకుండా మహిళలు ప్రయాణించడాన్ని కూడా నిషేధించారు. ఇంటి వెలుపల బురఖాను తప్పనిసరి చేశారు. గత నెల నవంబర్‌లో పార్కులు, ఫెయిర్లు, జిమ్‌లను సందర్శించకుండా నిషేధించారు.