Site icon HashtagU Telugu

Kabul : ఉగ్రవాదులపై విరుచుపడుతోన్న తాలిబన్ ప్రభుత్వం…ఆరుగురు టెర్రరిస్టులు హతం..!!

Terrorism Story 647 1121170928

Terrorism Story 647 1121170928

అప్ఘనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం టెర్రరిస్టులపై పంజా విసురుతోంది. ఈ మధ్యే తీవ్రవాదులపై దాడి చేసి 5గురిని కాల్చివేసిన బలగాలు..మారోసారి ఉగ్రవాదులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు ఐఎస్ టెర్రరిస్టులు హతం అయ్యారు. ఈ విషయాన్ని తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతినిధి స్పందించారు. ఇస్లామిక్ ఎమిరేట్స్ లో ప్రత్యేక విభాగాలకు చెందిన బలగాలు శుక్రవారంఐఎస్ మిలిటెంట్ల స్థావరాలను గుర్తించాయి. ఇద్దరిని అరెస్ట్ చేసామని తెలిపారు. రహస్య స్థావరాలపై దాడి చేసి 6గురు టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు ట్వీట్ చేశారు.