Afghanistan : తాలిబాన్ ప్రభుత్వం కూడా TikTok, Pubg నిషేధిస్తుందట..ఎందుకో తెలుసా?

TikTok, Pubg ఈ యాప్స్ చాలా దేశాల్లో నిషేధించారు. ఇప్పుడు అప్ఘాన్ ప్రభుత్వం కూడా ఈ రెండు యాప్స్ ను నిషేధించాలని నిర్ణియించింది.

  • Written By:
  • Publish Date - September 19, 2022 / 08:48 AM IST

TikTok, Pubg ఈ యాప్స్ చాలా దేశాల్లో నిషేధించారు. ఇప్పుడు అప్ఘాన్ ప్రభుత్వం కూడా ఈ రెండు యాప్స్ ను నిషేధించాలని నిర్ణియించింది. ఈ మేరకు తాలిబాన్ నేతృత్వంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ప్రకటనను ఉటంకిస్తూ…రాబోయే మూడు నెలల్లో ఆప్ఘాన్ లో టిక్ టాక్, పబ్జీ యాప్స్ ను నిషేధించబోతున్నట్లు తెలిపింది. భద్రతా రంగానికి చెందిన ప్రతినిధులు, షరియాలా ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధితో జరిగిన ఈ సమావేశంలో తాలిబాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. 90 రోజుల్లో టిక్ టాక్, పబ్జీ రెండింటిని నిషేధించాలని నిర్ణయించారు.

అమెరికా దళాల ఉపసంహరణ తర్వాత తాలిబాన్ నేతృత్వంలోని తాత్కాలిక ఆఫ్ఘన్ సర్కార్ గతేడాది ఆగస్టు 15న అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ల స్వాధీనం ఈ దేశం ఆర్థిక సంక్షోభాన్నిఆహార కొరతను ఎదుర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌లో మానవతా సంక్షోభం కూడా పెరిగింది. తాలిబాన్‌లో విస్తృతంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనే భయంతో వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు దేశం నుండి పారిపోయారు.