Terrorism: హత్యను వీడియో తీసి.. పాక్‎కు పంపితే డబ్బు!

ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో ఢిల్లీ పోలీసులు నౌషద్, జగ్జీత్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - January 15, 2023 / 06:55 PM IST

Terrorism: ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో ఢిల్లీ పోలీసులు నౌషద్, జగ్జీత్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో వాళ్లు అద్దెకు ఉంటున్న ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా.. వారికి షాకింగ్ విజువల్స్ కనిపించాయి. అక్కడ మూడు పిస్తోళ్లు, 22 రౌండ్ల బుల్లెట్లతో పాటు రెండు గ్రనేడ్లు దొరికాయి. దీంతో పోలీసులు మరింత లోతుగా సోదాలు నిర్వహించగా.. మరో భారీ షాక్ తగిలింది.

సోదాలు చేస్తున్న సమయంలో పోలీసులు ఆ ఇంట్లో రక్తపు మరకలను గుర్తించగా.. నౌషద్, జగ్జీత్ సింగ్ లు ఎవరినో హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు. దాంతో వాళ్లు వారిద్దరిని గట్టిగా విచారించగా.. ఓ వ్యక్తిని హత్య చేసి వీడియోను పాకిస్థాన్ లోని ఉగ్రవాదులకు పంపినట్లు తేలింది. ఢిల్లీ ఆదర్శ్ నగర్ లోని ఓ మాదకద్రవ్యాలు తీసుకునే వ్యక్తిని భలాస్వా డెయిరీ సమీపంలోకి తీసుకొచ్చి హత్య చేస్తూ. 37 సెకన్ల వీడియోను షూట్ చేశారు.

ఇలా ఆ వీడియోను పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులకు పంపితే వాళ్లు.. వీరి అకౌంట్లకు రెండు లక్షల రూపాయలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఓ వర్గం వారిని హత్య చేయాలని ఉగ్రవాదులు నౌషద్ మరియు జగ్జీత్ సింగ్ లకు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా గతంలో కూడా నౌషద్ ను ఉగ్రవాదులతో సంబంధాలు కలిగిన నేరంలో అరెస్టు చేయగా.. జగ్జీత్ సింగ్ ఖలిస్తాన్ సపోర్టర్ అని పోలీసులు గుర్తించారు.