Spy Balloon: తైవాన్ సరిహద్దుల్లో చైనా స్పై బెలూన్ కలకలం

ఇటీవల కాలంలో చైనాకు చెందిన స్పై బెలూన్స్ (Spy Balloons) కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా తైవాన్ సరిహద్దుల్లో ఈ బెలూన్‌ను గుర్తించినట్లు తైవాన్ ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - February 17, 2023 / 09:25 AM IST

ఇటీవల కాలంలో చైనాకు చెందిన స్పై బెలూన్స్ (Spy Balloons) కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా తైవాన్ సరిహద్దుల్లో ఈ బెలూన్‌ను గుర్తించినట్లు తైవాన్ ప్రకటించింది. తైవాన్‌పై చైనా దాడికి సిద్దమవుతున్న వేళ, గస్తీ కోసం బెలూన్ ప్రయోగించి ఉండొచ్చని అభిప్రాయపడింది. కాగా ఇటీవలే తమ సైనిక స్థావరాలపై చైనా నిఘా పెడుతుందని అమెరికా ఓ బెలూన్‌ను పేల్చేసింది. చైనా తీరానికి సమీపంలో ఉన్న వ్యూహాత్మక ద్వీపం సమీపంలో స్పై బెలూన్ అవశేషాలను గుర్తించినట్లు తైవాన్ సైన్యం ధృవీకరించింది. యునైటెడ్ స్టేట్స్ సరిహద్దు రేఖల్లోకి ప్రవేశించిన చైనీస్ గూఢచారి బెలూన్‌ను అమెరికా ధ్వంసం చేసిన కొద్ది రోజులకే ఈ ఆరోపణలు వచ్చాయి.

మరోవైపు.. తైవాన్‌కు ఆయుధాలు విక్రయిస్తున్న రెండు అమెరికా రక్షణ కంపెనీలపై చైనా నిషేధం విధించింది. లాక్‌హీడ్ మార్టిన్ కార్ప్, రేథియాన్ టెక్నాలజీస్ కార్ప్‌లను “అవిశ్వసనీయ సంస్థల జాబితా”లో చేర్చినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఈ ఆంక్షలు ఈ రక్షణ కంపెనీలను చైనాకు సంబంధించిన దిగుమతి, ఎగుమతి కార్యకలాపాలలో నిమగ్నం చేయకుండా నిరోధించాయి.

Also Read: CEO of YouTube: యూట్యూబ్ సీఈవో పదవికి సుసాన్ వోజ్కికీ రాజీనామా.. కొత్త సీఈవోగా నీల్ మోహన్..!

అంతకుముందు.. గత ఏడాది ఫిబ్రవరిలో తైవాన్‌కు 100 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించడంపై చైనా రెండు సంస్థలపై నిషేధం విధించింది. ఈ విక్రయం చైనా రక్షణ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని, చైనా-అమెరికా సంబంధాలను, తైవాన్‌లో శాంతి, స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.