Site icon HashtagU Telugu

Israeli Strike: సిరియా భూభాగంలోకి ఇజ్రాయెల్ రాకెట్లు

Israeli Strike

1646366 92940730

Israeli Strike: ఇజ్రాయెల్ సిరియా మధ్య యుద్ధం సర్వసాధారమైపోయింది. ఈ రెండు దేశాల మధ్య సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా సిరియాపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే ఇజ్రాయెల్ దాడిని తిప్పికొట్టినట్లు సిరియా వైమానిక రక్షణ వ్యవస్థ ఓ నివేదికలో పేర్కొంది.

ఇజ్రాయెల్ శనివారం సిరియా భూభాగంలోకి అనేక రాకెట్లను ప్రయోగించింది. కాగా ఇజ్రాయెల్ రాకెట్ దాడిని సిరియా వైమానిక రక్షణ వ్యవస్థలు తిప్పికొట్టాయని సిరియన్ స్టేట్ మీడియా నివేదించింది. వాటిలో కొన్ని రాకెట్లను కూల్చివేసినట్లు తెలిపారు. 2011లో ప్రారంభమైన అంతర్యుద్ధంలో అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌కు మద్దతు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుండి టెహ్రాన్ ప్రభావం పెరిగిన సిరియాలో ఇరాన్‌తో ముడిపడి ఉన్న లక్ష్యాలపై ఇజ్రాయెల్ సంవత్సరాలుగా దాడులు చేసింది.

సిరియాలో ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేక సార్లు ఈ తరహా దాడులు చేసింది. గతంలో సిరియాలో దాడుల్లో పాల్గొన్న తమ ఎఫ్-16 యుద్ధవిమానం కూలిపోయిన తర్వాత సిరియా గగనతల రక్షణ వ్యవస్థలు లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. వాటికి భారీ నష్టం కలిగించామని ఇజ్రాయెల్ ఓ ప్రకటనలో పేర్కొంది.

Read More: Secretariat: సాగనతీరాన అందాలసౌథం… తెలంగాణ సెక్రటేరియట్ ప్రత్యేకతలెన్నో