Site icon HashtagU Telugu

Sudan Crisis: సూడాన్ సంక్షోభం: ఘర్షణల్లో 180 మంది మృతి.. 1,800 మందికి పైగా గాయాలు

Sudan

Resizeimagesize (1280 X 720) 11zon

సూడాన్‌ (Sudan) నియంత్రణపై ఆ దేశ సైన్యం, శక్తివంతమైన పారామిలటరీ దళం మధ్య సోమవారం వరుసగా మూడో రోజు పోరు కొనసాగింది. ఈ పోరాటంలో ఇప్పటి వరకు 180 మంది సామాన్యులు చనిపోయారు. 1,800 మందికి పైగా పౌరులు, పోరాట యోధులు గాయపడ్డారు. రాజధాని ఖార్టూమ్ దాని పొరుగు నగరమైన ఓమ్‌దుర్మాన్‌లో సోమవారం వైమానిక దాడులు, షెల్లింగ్ తీవ్రమయ్యాయి. ఇదిలా ఉంటే అక్కడ నివసిస్తున్న భారతీయులు తమ ఇళ్ల నుండి బయటకు రావద్దని, ప్రశాంతంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం కోరింది.

ర్యాపిడ్​ సపోర్ట్​ ఫోర్సెస్ (ఆర్​ఎస్​ఎఫ్)​ను సూడాన్​ ఆర్మీలో విలీనం చేసేందుకు ఆర్మీ చీఫ్​ అబ్దెల్​ ఫత్తా బుర్హాన్​ చేసిన ప్రతిపాదన ఈ అంతర్యుద్ధానికి దారితీసింది. సైన్యంలో తమ గ్రూప్​ను విలీనం చేయరాదంటూ మహ్మద్​ హమ్దాన్​ దగాలో నేతృత్వంలోని ర్యాపిడ్​ సపోర్ట్​ ఫోర్సెస్ తిరుగుబాటు చేశాయి. మరోవైపు అంతర్గత యుద్ధాన్ని ఆపాలంటూ సూడాన్​కు అమెరికా, యూరోపియన్​ యూనియన్, అరబ్​లీగ్​, ఆఫ్రికన్​ యూనియన్​, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విజ్ఞప్తి చేశాయి.

పరిస్థితి అదుపు తప్పినందున భారతీయులందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇండియన్ మిషన్ హెచ్చరించింది. ఖార్టూమ్‌లో కాల్చి చంపబడిన భారతీయుడి మృతి పట్ల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం వ్యక్తం చేసింది. మరోవైపు ఖార్టూమ్, ఓమ్‌దుర్మాన్‌లోని ప్రజలు తమ ఇళ్లలో విద్యుత్ కోత ఏర్పడినప్పుడు దోపిడీకి పాల్పడ్డారు. అంతకుముందు ప్రజాస్వామ్య అనుకూల సమూహం ‘సుడాన్ డాక్టర్స్ సిండికేట్’ సోమవారం 97 మరణాలను ధృవీకరించింది. ఈ ఘర్షణలో వందలాది మంది గాయపడ్డారని చెప్పారు. దేశం మిలిటరీ, దాని మాజీ భాగస్వామి ఇప్పుడు ప్రత్యర్థి అయిన రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ గ్రూప్ (RSF) మధ్య నెలరోజుల ఉద్రిక్తత తర్వాత ఈ ఘర్షణ జరిగింది.

Also Read: Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో రూ. 17 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం.. విదేశీయుడు అరెస్ట్

అదే సమయంలో భద్రతా పరిస్థితుల దృష్ట్యా, సుడాన్‌లో అన్ని కార్యకలాపాలు ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంటాయని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ తాత్కాలిక డైరెక్టర్ సిండి మెక్‌కెయిన్ చెప్పారు. రెండు రోజుల క్రితం సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో కాల్చి చంపబడిన కేరళ వాసి ఆల్బర్ట్ ఇక్కడ దాల్ గ్రూప్ కంపెనీలో పనిచేశాడు. అతను మేలో కొన్ని రోజుల పాటు భారతదేశంలోని తన ఇంటికి వెళ్లాల్సి ఉంది. కానీ ఆ విషాదం జరగడానికి ముందు రిటైర్డ్ సైనికుడు ఆల్బర్ట్ అగస్టిన్ ఈస్టర్ జరుపుకోవడానికి కొన్ని వారాల క్రితం తన భార్య, కుమార్తెను సూడాన్‌కు పిలిచాడు. మే 3న వారితో కలిసి భారతదేశానికి తిరిగి రావడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు.

ఆల్బర్ట్ అస్థికలను దేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. భారతీయుల కోసం సుడాన్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. దీని కోసం మంత్రిత్వ శాఖ 1800-11-8797 (టోల్ ఫ్రీ), +91-11-23012113, +91-11-23014104, +91-11-23017905, మొబైల్ +91-9968291988 నంబర్లను సంప్రదించాలని కోరింది.