బంగ్లాదేశ్ (Bangladesh )లో నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆర్మీ ఛీఫ్ వకారుజ్జమాన్ తెలిపారు. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల మార్పుల తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థులను అక్కడి ప్రభుత్వం అణిచివేయడంతో మరోసారి హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఈ ఘర్షణలో 300 మందికి పైగా చనిపోయారు. ప్రభుత్వం ఈ ఘటనలకు బాధ్యత వహించాలని.. ప్రధాని షేక్ హసీనా (Prime Minister Sheikh Hasina) రాజీనామా చేయాలంటూ నిరసనకారులు ఆమె నివాసాన్ని ముట్టడి చేసారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని షేక్ హసీనా సోమవారం మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆమె భారత్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం బంగ్లా దేశ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆర్మీ ఛీఫ్ వకారుజ్జమాన్ (Army chief Waker-Uz-Zaman) కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు కానుందని ప్రకటించారు. తాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌ను కలవబోతున్నానని, ఈరోజు రాత్రిలోకా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో ఇప్పటికే మాట్లాడినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. అయితే ప్రభుత్వానికి ఎవరు సారథ్యం వహిస్తారనే దానిపై స్పష్టత లేదు. బంగ్లాదేశ్ ప్రజలందరికీ న్యాయం చేస్తామని ఆర్మీఛీఫ్ ప్రతిజ్ఞ చేశారు.
ఇక 1971లో బంగ్లాదేశ్ పాకిస్థాన్‌తో పోరాడి స్వాతంత్య్రం సాధించుకుంది. దీంతో స్వాతంత్య పోరాట యోధులకు, వారి వారసులకు 30 శాతం రిజర్వేషన్‌ను కేటాయిస్తూ 1972లో అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 2018లో ఈ రిజర్వేషన్‌ను షేక్ హసీనా ప్రభుత్వం రద్దు చేసింది. కొంతమంది దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. స్వాతంత్ర్య పొరాట యోధుల వారసులకు మళ్లీ 30 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ తీర్పునిచ్చింది ఈ తీర్పును వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు తీవ్రతరంగా మారాయి.
Read Also : Kejriwal Govt : కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కేదురు