Starlink: టెక్ దిగ్గజం, అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల విభాగమైన స్టార్‌లింక్‌కు భారత్‌లో ఓ కీలక అనుమతి లభించింది. దేశంలో శాట్కాం సేవలందించేందుకు అవసరమైన లైసెన్స్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) జారీ చేసింది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) సేకరించిన సమాచారం ప్రకారం, ఈ విషయాన్ని సంబంధిత శాఖ వర్గాలు ధృవీకరించాయి.
స్టార్‌లింక్ దేశంలో లైసెన్స్ పొందిన మూడవ సంస్థగా నిలిచింది. ఇప్పటికే భారత మార్కెట్లో Eutelsat OneWeb, Jio Satellite వంటి సంస్థలు శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల కోసం లైసెన్స్ పొందగా.. ఇప్పుడు స్టార్‌లింక్ కూడా ఈ పోటీలో చేరింది.
DoT వర్గాల ప్రకారం, స్టార్‌లింక్ సంస్థ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన 15–20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ (పరీక్షల నిమిత్తం అవసరమైన తరంగదైర్ఘ్యం) మంజూరయ్యే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
స్టార్‌లింక్ లక్ష్యం..గ్రామీణ భారతానికి హైస్పీడ్ ఇంటర్నెట్
స్టార్‌లింక్ ప్రణాళిక ప్రకారం, శాటిలైట్ ఆధారంగా భారత్‌లో కూడా విస్తృతమైన హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించాలన్నది లక్ష్యంగా ఉంది. ముఖ్యంగా అంతర్యామి ప్రాంతాలు, ట్రాడిషనల్ బ్రాడ్‌బ్యాండ్ లేనివాటికి ఈ సేవలు భారీగా ఉపయోగపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో డిజిటల్ ఇండియా కాన్సెప్ట్‌తో దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో స్టార్‌లింక్ లైసెన్స్ పొందడం కీలక ఘట్టంగా భావించబడుతోంది.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా స్టార్‌లింక్ వేల సంఖ్యలో శాటిలైట్‌లను నింగిలోకి పంపించి సేవలు అందిస్తోంది. ఇప్పుడు భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు వీలయ్యేలా లైసెన్స్ మంజూరు కావడం సంస్థకు కొత్త అవకాశాలను తెరలేపుతోంది. భవిష్యత్‌లో ట్రయల్ స్పెక్ట్రమ్‌తో పాటు కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించే దిశగా స్టార్‌లింక్ యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
Maruti Suzuki Swift: స్విఫ్ట్ మోడల్ ఉత్పత్తిని నిలిపివేయనున్న సుజుకీ.. కారణమిదే?