Starbucks: ఉద్యోగం నుంచి తొలగించినందుకు స్టార్‌బక్స్‌కు రూ. 210 కోట్ల ఫైన్.. అసలేం జరిగిందంటే..?

ప్రముఖ కాఫీ సంస్థ స్టార్‌బక్స్‌ (Starbucks)కు ఎదురుదెబ్బ తగిలింది. శ్వేతజాతీయురాలిననే కారణంతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని, తనపై జాతివివక్ష ప్రదర్శించారని షానన్‌ ఫిలిప్స్‌ అనే ఉద్యోగిని కేసు వేసింది.

  • Written By:
  • Updated On - June 16, 2023 / 09:46 AM IST

Starbucks: ప్రముఖ కాఫీ సంస్థ స్టార్‌బక్స్‌ (Starbucks)కు ఎదురుదెబ్బ తగిలింది. శ్వేతజాతీయురాలిననే కారణంతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని, తనపై జాతివివక్ష ప్రదర్శించారని షానన్‌ ఫిలిప్స్‌ అనే ఉద్యోగిని కేసు వేసింది. ఆ కేసును విచారించిన ఫెడరల్‌ జ్యూరీ ఆ ఉద్యోగినికి 25.6 మిలియన్ల డాలర్లు (రూ.210కోట్లు) చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. ఉద్యోగిని హక్కులకు భంగం కలిగించిందని కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ వివాదం 2018 లో మొదలైంది. రిటెన్‌హౌస్ స్క్వేర్‌లోని స్టార్‌బక్స్ ఫిలడెల్ఫియా స్టోర్‌లో ఇద్దరు నల్లజాతీయులు రాషోన్ నెల్సన్, డోంటే రాబిన్సన్ అనే వ్యక్తులు తమ బిజినెస్ పార్టనర్ ను కలవడం కోసం వచ్చామని చెప్పి చాలా సమయం షాప్ లో ఎదురు చూసారు. తరువాత వారిలో ఓ వ్యక్తి టాయిలెట్‌ను ఉపయోగిస్తానని కోరగా, అతను ఏమీ కొనుగోలు చేయలేద అన్న కారణంతో సిబ్బంది అనుమతి నిరాకరించారు. చాలా సమయం షాప్ లో నిరీక్షించిన కారణంగా వారిని బయటకు వెళ్లిపోవాల్సిందిగా కోరారు. కానీ నెల్సన్, రాబిన్సన్ అందుకు నిరాకరించారు. దీంతో సిబ్బంది పోలీసులను పిలిచి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు. ఈ అరెస్టుకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.

Also Read: Canada: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం, ప్రధాని జస్టిన్ ట్రూడో సంతాపం

వెంటనే స్టార్ బుక్స్ తన తప్పు దిద్దుకొనే చర్యలలో భాగంగా స్టార్‌బక్స్‌లో సుమారు 13 సంవత్సరాలు పనిచేసిన షానన్ ఫిలిప్స్ ను తొలగించింది. అయితే సంఘటన జరిగినప్పుడు ఉన్న షాప్ మేనేజర్, నల్లజాతీయుడు తన ఉద్యోగాన్ని కొనసాగించాడు. దీంతో 2019లో నిరసనల నేపథ్యంలో శ్వేతజాతీయుల ఉద్యోగులపై జాతి వివక్షను పాటించినందుకు షానన్ స్టార్‌బక్స్‌పై దావా వేశారు. కేసును పరిశీలించిన ఫెడరల్ జ్యూరీ, స్టార్‌బక్స్ ఎంఎస్ ఫిలిప్స్ సమాఖ్య పౌర హక్కులను ఉల్లంఘించిందని, అలాగే జాతి ఆధారంగా వివక్షను నిషేధించే న్యూజెర్సీ చట్టాన్ని ఉల్లంఘించిందని, ఆమెకు $600,000 పరిహార నష్టపరిహారం, $25 మిలియన్ల శిక్షా నష్టాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేసింది.