స్పెయిన్ (Spain train crash)లో రైలు ప్రమాదం జరిగింది. బార్సిలోనాలోని ఓ రైల్వే స్టేషన్‌లో ఆగివున్న రైలును మరో ట్రైన్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈప్రమాదంలో దాదాపు 155 మంది గాయపడ్డారు. వెంటనే స్పందించిన అధికారులు సహాయ చర్యలు చేపట్టి బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన జరిగిన సమయంలో రైలు వేగం తక్కువగా ఉండడంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
స్పెయిన్‌లో రైలు ప్రమాద (Spain train crash) ఘటన వెలుగు చూసింది. స్పెయిన్‌లోని బార్సిలోనా నగరం సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. బార్సిలోనాకు ఉత్తరాన ఉన్న మోంట్‌కాడా ఐ రీక్సాక్ నగరంలోని రైలు మార్గంలో ప్రమాదం జరిగింది. రెండు రైళ్ల డ్రైవర్లకు ముందు నుంచి రైళ్లు వస్తున్న విషయం తెలియలేదు. స్పెయిన్‌లోని బార్సిలోనా సమీప మార్గంలో రెండు రైళ్లు ఢీకొనడంతో 155 మంది గాయపడ్డారు. ఈ మేరకు స్పెయిన్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం తరువాత పలువురిని వైద్య కేంద్రానికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అయితే ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని కాటలోనియా ఎమర్జెన్సీ సర్వీస్ తెలియజేసింది.
Also Read: Megastar Chiranjeevi: సంక్రాంతి రేసులో చిరు.. ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ ఘటనతో ఆ ట్రాక్ వెంట రెండు దిశలలో రైళ్లు నిలిపివేశారు. ఈ ఘటనకు కారణం ఏంటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ రైలు ప్రమాదంలో 155 మంది ప్రభావితమయ్యారు. వారిలో 150 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఐదుగురు మధ్యస్తంగా గాయపడ్డారని ఓ ప్రతినిధి తెలిపారు. బార్సిలోనాకు ఉత్తరాన 10 కిలోమీటర్ల (ఆరు మైళ్లు) దూరంలో ఉన్న ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, అక్కడికి 18 వైద్య విభాగాలను మోహరించినట్లు అధికారి పేర్కొన్నారు. స్పెయిన్‌లోని మాడ్రిడ్ నగరంలో కాటలోనియా ప్రభుత్వ ప్రతినిధి ఈస్టర్ కాపెల్లా ఈ విషయంపై స్పెయిన్ నేషనల్ రేడియోలో మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారంపై అధికారులు విచారణ ప్రారంభించినట్లు ప్రభుత్వ ప్రతినిధి సమాచారం అందించారు.