Porn Passport : అశ్లీల ఫొటోలు, వీడియోలను ఇటీవల కాలంలో కొందరు మైనర్లు కూడా చూసేస్తున్నారు. ఇందుకోసం వారు వివిధ పోర్న్ వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. ప్రత్యేకించి విదేశాల్లో మైనర్లకు అశ్లీల కంటెంట్ బాగా అందుబాటులో ఉంటోంది. దీంతో అక్కడ విచ్చలవిడితనం పెరిగిపోతోంది. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా ఐరోపా దేశాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఈవిషయంలో స్పెయిన్ (Porn Passport) ముందంజలో ఉంది.
We’re now on WhatsApp. Click to Join
మైనర్లు అశ్లీల కంటెంట్‌ను చూడకుండా అడ్డుకునేందుకు స్పెయిన్ ప్రభుత్వం ఒక యాప్‌ను ప్రవేశపెట్టనుంది. దాని పేరు.. ‘కార్టెరా డిజిటల్ బీటా’. ఈ యాప్‌ను ‘పజాపోర్టే’ అని కూడా పిలుస్తారు. ఈ యాప్ ఒక మొబైల్ వ్యాలెట్‌లా పనిచేస్తుంది. దీన్ని స్పెయిన్ ప్రభుత్వం జారీ చేసే ఐదు ధ్రువపత్రాల్లో ఏదో ఒక దానికి ప్రతి ఒక్కరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా వయసును ధ్రువీకరిస్తారు. 18 ఏళ్లలోపు వారికి ‘కార్టెరా డిజిటల్ బీటా’ యాప్‌లోకి యాక్సెస్ లభించదు. 18 ఏళ్లకుపైబడిన వారందరికీ ప్రతినెలా 30 క్రెడిట్లను మంజూరు చేస్తారు. ప్రతీ ఒక క్రెడిట్‌కు ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. దాని ద్వారా పోర్న్ వెబ్‌సైట్‌కు యాక్సెస్‌ను పొందొచ్చు. తొలుత ఈ యాప్‌ను వాడటాన్ని ఆప్షనల్‌గానే ఉంచాలని స్పెయిన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ యాప్‌కు సంబంధించిన బాధ్యతను నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్‌కు స్పెయిన్(spain) ప్రభుత్వం అప్పగించింది.
Also Read :Worlds Expensive Insect : ఈ పురుగు దొరికితే మీరు లక్షాధికారే
ఇదేతరహా పద్ధతిని రానున్న రోజుల్లో సోషల్ మీడియా వెబ్‌సైట్లకు కూడా విస్తరించాలని స్పెయిన్ సర్కారు భావిస్తోంది. ఇప్పటికే ఆయా సోషల్ మీడియా సంస్థలతో చర్చలు ప్రారంభించిందని సమాచారం. తప్పుదోవ పట్టించే సమాచారం నుంచి పిల్లలను దూరంగా ఉంచాలనే సంకల్పంతో ఐరోపా సమాఖ్య తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే తాము కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం చెబుతోంది. త్వరలో ఇతర ఐరోపా దేశాలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది.