Site icon HashtagU Telugu

Space Walk : చరిత్రలో తొలిసారిగా స్పేస్ వాక్.. పొలారిస్‌ డాన్‌ మిషన్‌‌ సక్సెస్

Spacex Polaris Space Walk

Space Walk : ప్రపంచంలోనే ధనికుడు ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష సంస్థ ‘స్పేస్‌ఎక్స్‌’ మరో చరిత్ర సృష్టించింది. పొలారిస్‌ డాన్‌ మిషన్‌‌లో భాగంగా ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన నలుగురు వ్యోమగాములు తొలిసారిగా ప్రైవేటు స్పేస్‌వాక్‌ చేశారు. ఈ మొత్తం మిషన్‌కు వ్యాపారవేత్త జేర్డ్‌ ఇసాక్‌మన్‌ నేతృత్వం వహించారు. ఈ మిషన్‌‌కు పైలట్‌గా అమెరికా వాయుసేన మాజీ ఉద్యోగి స్కాట్‌ కిడ్‌ వ్యవహరించారు. స్పేస్ వాక్ కోసం వెళ్లిన వారిలో స్పేస్‌ఎక్స్‌ ఇంజినీర్లు సారా గిల్లి, అన్నా మెనోన్‌ కూడా ఉన్నారు. ఈ ప్రాజెక్టులో పూర్తిగా స్పేస్‌ఎక్స్‌(Space Walk) కంపెనీ పరికరాలనే వాడారు. పొలారిస్‌ డాన్‌ మిషన్‌‌లో భాగంగా మూడో రోజున ఇద్దరు వ్యోమగాములు డ్రాగన్ క్యాప్సూల్‌ నుంచి బయటకు వచ్చి 15 నుంచి 20 నిమిషాలపాటు స్పేస్‌వాక్‌ చేశారు. వ్యోమగాములు స్పేస్‌వాక్‌ చేసిన మొదటి ప్రైవేట్‌ మిషన్‌ ఇదే.

Also Read :Maoists Surrender Policy : సరెండర్ అయ్యే మావోయిస్టుల కోసం సరికొత్త పాలసీ

ఇవాళ స్పేస్ వాక్ చేసిన జేర్డ్‌ ఇసాక్‌మన్‌ ప్రొఫెష‌న‌ల్ ఆస్ట్రోనాట్ కాదు. ఆయనొక వ్యాపారవేత్త. అయినా  కానీ ఆయనకు అంత‌రిక్షంలో స్పేస్‌వాక్ చేసే అవకాశాన్ని కల్పించారు. భూమి నుంచి స్పేస్ స్టేష‌న్‌కు ఉండే దూరానికి మూడు రెట్లు అధిక దూరంలో (435 మైళ్ల దూరం) ఈ నలుగురు వ్యోమగాములతో కూడిన డ్రాగ‌న్ వ్యోమ‌నౌక ఉంది.స్పేస్‌క్రాఫ్ట్‌కు చెందిన కిటికీకి తెరవగానే.. అమెరికాలోని స్పేస్ఎక్స్ సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో సంబురాలు మొదలయ్యాయి. జేర్డ్‌ ఇసాక్‌మన్‌ తొలుత స్పేస్ వాక్ చేశారు. ఆ త‌ర్వాత సారా గిల్స్ స్పేస్‌వాక్‌ చేశారు. బిలియ‌నీర్ జేర్డ్‌ ఇసాక్‌మన్‌ ఈ ట్రిప్ కోసం ఎలాన్ మ‌స్క్ కంపెనీ స్పేస్ ఎక్స్‌కు భారీగా డ‌బ్బులు పే చేశారు. ఈవిధంగా టూరిస్టులను స్పేస్ వాక్‌కు పంపడం ద్వారా భారీగా డబ్బులు సంపాదించాలని అపర కుబేరుడు ఎలాన్ మస్క్ భావిస్తున్నారు. అంత‌రిక్షం నుంచి భూమిని చూసిన జేర్డ్‌ ఇసాక్‌మన్‌.. భూమి అద్భుతంగా ఉందని కామెంట్ చేశారు.

Also Read :Spam Calls : స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌‌లకు చెక్.. ఏకమవుతున్న టెల్కోలు