Site icon HashtagU Telugu

SpaceX Rescue Mission: సునీతా విలియమ్స్ మరియు టీం కోసం రెస్క్యూ మిషన్‌ ప్రారంభం

Space X, Sunita Williams

Space X, Sunita Williams

SpaceX Rescue Mission: బిలియనీర్ ఎలోన్ మస్క్ స్థాపించిన స్పేస్‌ఎక్స్ (SpaceX) అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams) మరియు బుచ్ విల్మోర్ కోసం శనివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో రెస్క్యూ మిషన్‌ను ప్రారంభించింది. వారిని క్షేమంగా భూమండలానికి తీసుకురావడానికి సిబ్బందిని స్పేస్ కు పంపించింది.

అంతరిక్ష యాత్రికులు సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్‌లను తిరిగి తీసుకురావడానికి ఇద్దరు ప్రయాణికులు మరియు రెండు ఖాళీ సీట్లతో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుండి స్పేస్‌ఎక్స్ మిషన్ శనివారం బయలుదేరింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నెలరోజులుగా వ్యోమగాములు చిక్కుకుపోయారు.

రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు ఎక్కువ సమయం తీసుకుంటోంది?
నిపుణుల అభిప్రాయం ప్రకారం షెడ్యూల్ చేసిన ఇతర మిషన్‌లకు అంతరాయం కలగకుండా ముందుగా స్పేస్ ఎక్స్ (SpaceX) లో విల్మోర్ మరియు విలియమ్స్ లను తిరిగి భూమండలానికి తీసుకురావడానికి మార్గం లేదు. వారు తిరిగి వచ్చే సమయానికి వీళ్లిద్దరు అంతరిక్షంలో ఎనిమిది నెలలకు పైగా లాగిన్ అయి ఉంటుంది.

Also Read: CM Bhagwant Health: పంజాబ్‌ సీఎం భగవాన్‌ మాన్‌కు లెప్టోస్పిరోసిస్‌ పాజిటివ్