Presidents Impeachment : దక్షిణ కొరియా(South Korea)లో కీలక పరిణామం జరిగింది. దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్యంగా ఇవాళ తన పదవిని కోల్పోయారు. ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం(presidents impeachment)పై అధికార, విపక్ష పార్టీలు కలిసికట్టుగా ఓటు వేశాయి. దీంతో యూన్ సుక్ యోల్ గద్దె దిగాల్సి వచ్చింది. పార్లమెంటులో ఉన్న మొత్తం 300 మంది ఎంపీల్లో 204 మంది అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో.. ప్రస్తుత అధ్యక్షుడి పదవికి చెక్ పడింది. దీంతో దక్షిణ కొరియాకు తాత్కాలిక దేశాధ్యక్షుడిగా ప్రధానమంత్రి హాన్ డక్ సూను నియమిస్తూ పార్లమెంటు ప్రకటన విడుదల చేసింది. కొత్త దేశాధ్యక్షుడి నియామకం జరిగే వరకు.. ఆ బాధ్యతలను ప్రధాని నిర్వర్తించనున్నారు. ఇక దేశాధ్యక్షుడి తొలగింపుపై దక్షిణకొరియా రాజ్యాంగ న్యాయస్థానం 180 రోజుల్లోగా తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పు వెలువడిన 60 రోజుల్లోగా నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. యూన్ సుక్ యోల్ తొలగింపు నేపథ్యంలో దేశ రాజధాని సియోల్‌లో పెద్దసంఖ్యలో యూన్ సుక్ యోల్ మద్దతుదారులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయననే అధ్యక్షుడిగా కొనసాగించాలని కోరారు. నిరసనకారులను నియంత్రించడానికి పోలీసులు, భద్రతా బలగాలను పెద్దసంఖ్యలో మోహరించారు.
Also Read :Fact Check : శశిథరూర్ కాలికి గాయంపై దుమారం.. ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిందో తెలుసా ?
వారం కిందట పార్లమెంటు(South Korea parliament)లో యూన్ సుక్ యోల్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అప్పట్లో అధికార పీపుల్స్ పవర్ పార్టీ ఎంపీలు భారీసంఖ్యలో డుమ్మా కొట్టారు. దీంతో గండం నుంచి అధ్యక్షుడు యూన్ సుక్ గట్టెక్కారు. ఈసారి మాత్రం అధికార పార్టీ ఎంపీలు అందరూ హాజరై.. విపక్ష ఎంపీలతో కలిసి యూన్ సుక్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ఆయన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మొత్తం మీద దక్షిణ కొరియా రాజకీయ రసకందాయంలో పడింది. అధికార, విపక్షాలు దేశ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఏకం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.