Site icon HashtagU Telugu

South Korea Vs North Korea : దక్షిణ కొరియా తీర ప్రాంతాలపైకి ఉత్తర కొరియా కాల్పులు.. హైటెన్షన్

South Korea Vs North Korea

South Korea Vs North Korea

South Korea Vs North Korea : దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తాజాగా శుక్రవారం ఉత్తర కొరియా ఆర్మీ.. దక్షిణ కొరియా సముద్ర జలాల వైపుగా ఫిరంగ గుండ్లతో దాదాపు 200కుపైగా కాల్పులు జరిపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన దక్షిణ కొరియా.. సముద్ర తీరంలోని రెండు దీవులలో నివసించే ప్రజలను అక్కడి నుంచి ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద నార్తర్న్ లిమిట్ లైన్ (ఎన్‌ఎల్‌ఎల్) సముద్ర సరిహద్దు ప్రాంతం వైపుగా ఉత్తర కొరియా కాల్పులు జరిపిందని తెలుస్తోంది. ఈ దాడిలో పౌరులకు లేదా సైనికులకు ఎటువంటి నష్టం జరగలేదని దక్షిణ కొరియా సైన్యం ప్రకటించింది.

We’re now on WhatsApp. Click to Join.

‘‘ఉత్తర కొరియా ఇలాంటి చేష్టలతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడి శాంతిని చెదరగొట్టి, ఇతరులను రెచ్చగొట్టే ప్రయత్నాల్లో ఉత్తర కొరియా నిమగ్నమైంది’’ అని ఆరోపిస్తూ దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. యోన్‌పియోంగ్‌కు పశ్చిమాన ఉన్న ఒక ద్వీపం, సముద్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న బేంగ్‌నియోంగ్ ద్వీపం నివాసితులను ఇళ్లు ఖాళీ చేయాలని సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గతంలోకి వెళితే.. 2010 సంవత్సరంలోనూ యోన్‌ప్యోంగ్ ద్వీపంపై ఉత్తర కొరియా ఆర్మీ ఫిరంగి గుండ్లతో అనేక రౌండ్ల కాల్పులు జరిపింది. 1953లో కొరియా యుద్ధం(South Korea Vs North Korea)  టైంలో జరిగిన దాడుల్లో ఇద్దరు పౌరులు సహా నలుగురు వ్యక్తులు మరణించారు.

Also Read: Anti India Graffiti : మరో హిందూ ఆలయంపై ఖలిస్తానీ మూకల పిచ్చిరాతలు