Site icon HashtagU Telugu

South Korea Vs North Korea : మొన్న ఉత్తర కొరియా.. ఇవాళ దక్షిణ కొరియా.. స్పై శాటిలైట్ మోహరింపు

Spy Satellite

Spy Satellite

South Korea Vs North Korea : సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా ప్రయోగించిన వారం రోజులకే.. పోటాపోటీగా దక్షిణ కొరియా కూడా ఆర్మీ గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ‘వాండెన్‌బర్గ్  స్పేస్ ఫోర్స్’ బేస్ నుంచి ‘స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9’ రాకెట్‌ ద్వారా దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇది దక్షిణ కొరియా మొట్టమొదటి సైనిక గూఢచార ఉపగ్రహం. ఈ రాకెట్‌పై  ‘‘కొరియా’’ అనే పదాన్ని ప్రింట్ చేశారు. ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించిన నాలుగు నిమిషాల తర్వాత..  విజయవంతంగా  నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ గూఢచార ఉపగ్రహంతో భూమిపై ఉన్న దక్షిణ కొరియా ఆర్మీ కంట్రోల్ సెంటర్‌కు కమ్యూనికేషన్ లింక్ కూడా సక్సెస్ ఫుల్‌గా ఏర్పడింది. దక్షిణ కొరియా స్పై శాటిలైట్ భూమికి ఎగువన 600 కిలోమీటర్ల  ఎత్తులో తిరుగుతూ… భూమిపై ఉండే 30 సెంటీమీటర్ల (11.8 అంగుళాలు) చిన్న వస్తువును కూడా గుర్తించగలదు. ఉత్తర కొరియా ఆర్మీ యాక్టివిటీని పర్యవేక్షించడమే ఈ ఉపగ్రహం ప్రధాన లక్ష్యం. దక్షిణ కొరియా 2025 చివరికల్లా మరో నాలుగు గూఢచారి ఉపగ్రహాలను ప్రయోగించాలని(South Korea Vs North Korea) యోచిస్తోంది.

Also Read: Historical Churches : క్రిస్మస్ వేళ చారిత్రక చర్చిల విశేషాలివీ..