దక్షిణకొరియాలో పెను విషాదం నెలకొంది. శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని సియోల్ లో జరిగిన హాలోవీన్ పార్టీకి పెద్దెత్తున ప్రజలు హాజరయ్యారు. ఒక్కసారిగా భారీగా జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో డజన్ల కొద్దీ జనాలు ఊపిరిపీల్చుకోలేక అపస్మారక స్థితిలో రోడ్లపై పడిపోయారు. ఇరుకైన వీధిలోకి దాదాపు లక్షమంది ఒకేసారి రావడంతో ఊపీరిపీల్చుకునేేందుకు ఇబ్బందిగా మారింది. దీంతో తొక్కిసలాట జరగడంతో.. 149మంది దుర్మరణం చెందారు. 100మందికి పైగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఏకకాలంలోనే 50మందికిపై గుండెపోటు వచ్చినట్లు తేలింది. దీంతో హాలోవీన్ వేడుక శోకసంద్రంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.ఇరుకైన వీధిలో పెద్దెత్తున జనాలు గుంపులుగుంపులుగా రావడంతోనే ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. రోడ్లపై పడి ఉన్న క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రులకు తరలించారు.
[BREAKING] Over 100 people experience cardiac arrest after crowd surge in Itaewon where thousands gathered for Halloween https://t.co/D6ka7yUS86
— allkpop (@allkpop) October 29, 2022