Site icon HashtagU Telugu

South Korea : సియోల్ ఘటనపై రిషిసునాక్ , బిడెన్ సహా ప్రపంచ నేతల సంతాపం..!!

Korea

Korea

దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో హాలోవీన్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 149మంది మరణించారు. మరో వందమందికిపై గాయపడ్డారు. ఈ సమయంలో డజన్ల కొద్దీ ప్రజలు గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇరుకైన వీధిలోకి ఒకేసారి లక్షమంది రావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు కొరియా మీడియా వెల్లడించింది. సియోల్ ఘటనపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ సంతాపం వ్యక్తం చేశారు. ఇది భయంకరమైన వార్త అని ట్వీట్ చేశారు. ఈ దు:ఖ సమయంలో బాధితులకు, దక్షిణ కొరియా పౌరులందరికీ మా సానుభూతి అంటూ ట్వీట్ చేశారు.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా ఈ ఘటనపై సంతాపం తెలిపారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు. ఈ సమయంలో దక్షిణ కొరియా ప్రజలకు అండగా ఉంటాము. గాయపడిన వారు త్వరగా కోలోకోవాలని కోరకుంటున్నాము అని ట్వీట్ చేశారు. ఈ సంక్షోభ సమయంలో దక్షిణ కొరియాకు అమెరికా అండగా నిలుస్తోంది.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంతాపం వ్యక్తం చేశారు. కెనడా ప్రజల తరపున నా సంతాపం తెలియజేస్తున్నా అని ట్వీట్ చేశారు. ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంతాపం ప్రకటించారు.