War On Bedbugs : దక్షిణ కొరియాను వణికిస్తున్న నల్లులు

War On Bedbugs : గతంలో కరోనాతో సతమతమైన దక్షిణ కొరియా.. ఇప్పుడు మరో సంక్షోభంతో వణుకుతోంది.

Published By: HashtagU Telugu Desk
War On Bedbugs

War On Bedbugs

War On Bedbugs : గతంలో కరోనాతో సతమతమైన దక్షిణ కొరియా.. ఇప్పుడు మరో సంక్షోభంతో వణుకుతోంది. ఈసారి ఆ దేశాన్ని వణికిస్తున్నది ఏదో తెలుసా ? చిన్నపాటి నల్లులు. అవును ‘బెడ్ బగ్స్’ సమస్యతో దక్షిణ కొరియా ప్రజలు అల్లాడుతున్నారు. రైళ్లు, ఇళ్లు, బస్సులు, ఆఫీసులు ఇలా అన్నిచోట్లా నల్లులు హల్‌చల్ చేస్తూ ప్రజలను ఇబ్బందిపెడుతున్నాయి. ఈనేపథ్యంలో నల్లులపై దక్షిణ కొరియాకు చెందిన డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ యుద్ధం ప్రకటించింది. రైళ్లు, ఇళ్లు, బస్సులు, ఆఫీసుల్లోని నల్లులను నిర్మూలించేందుకు ప్రత్యేక సిబ్బందితో రసాయనాలను పిచికారీ చేయిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బెడ్ బగ్స్ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై దక్షిణ కొరియా ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలను ఉద్యమ స్థాయిలో నిర్వహిస్తున్నారు. క్రిమిసంహారకాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. బెడ్ బగ్స్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తిన కేసులు నవంబరు 7 నుంచి ఇప్పటివరకు దాదాపు 30 నమోదయ్యాయని  దక్షిణ కొరియా సర్కారు తెలిపింది. ఈ కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక మెడికల్ టీమ్‌లను రంగంలోకి దింపింది. బెడ్ బగ్ కేసులు పెరిగితే చికిత్స అందించేందుకు అదనపు బెడ్‌లను ఆస్పత్రులలో(War On Bedbugs) రెడీ చేశారు.

Also Read: Pakistan Passports : పాక్‌లో పాస్‌పోర్టుల సంక్షోభం.. ఏమైందంటే ?

  Last Updated: 10 Nov 2023, 01:00 PM IST