North and South Korea: మరోసారి బాలిస్టిన్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా.!

ఉత్తరకొరియా మరోసారి తూర్పు సముద్ర తీరం వైపు బాలిస్టిన్ క్షిపణిని ప్రయోగించింది.

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 06:56 PM IST

ఉత్తరకొరియా మరోసారి తూర్పు సముద్ర తీరం వైపు బాలిస్టిన్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. అమెరికా-దక్షిణకొరియా సైన్యాలు భారీస్థాయిలో సంయుక్త గగనతల విన్యాసాలు నిర్వహించిన నేపథ్యంలో హెచ్చరికగా ఈ క్షిపణిని ప్రయోగించినట్లు వెల్లడించింది. సౌత్ కొరియా అమెరికా విజిలెంట్ స్ట్రామ్ పేరిట యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అయితే విన్యాసాలను నార్త్ కొరియా ఖండించింది. తమపై దాడి చేయాలన్న దురుద్దేశంతోనే అమెరికా, సౌత్ కొరియాలు సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయని ఆరోపించింది. దీనికి ప్రతి చర్య ఉంటుందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు అత్యంత సన్నిహితుడు వర్కర్స్ పార్టీ కార్యదర్శి పాక్ జోంగ్ చోన్ హెచ్చరించారు.

సౌత్‌-కొరియాపైకి నార్త్‌-కొరియా దాదాపు 10 మిస్సైళ్లను సౌత్‌కొరియా సరిహద్దులో వేసింది. అయితే అందుకు సమాధానంగా సౌత్‌కొరియా మూడు ఎయిర్-టు-గ్రౌండ్ మిస్సైళ్లను వేసింది. సరిగ్గా నార్త్ కొరియా మిస్సైళ్లు పడిన ప్రదేశంలోనే సౌత్ కొరియా మిస్సైళ్లు పడ్డాయి. అనంతరం రెచ్చగొట్టే చర్యలకు సియోల్ ఘాటుగా స్పందిస్తుందని అధికారులు తెలిపారు. నార్తర్న్ లిమిట్ లైన్కు సౌత్గా ఉన్న అంతర్జాతీయ జాలాల్లో క్షిపణి పడినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. ఈ విషయాన్ని సౌత్ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ధృవీకరించారు. నార్త్ కొరియా క్షిపణులు ఇంత దగ్గరగా పడటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. నార్త్ కొరియా చర్య కవ్వింపు చర్యగా సౌత్ కొరియా అభివర్ణించింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ జాతీయ భద్రత మండలి సమావేశానికి పిలుపునిచ్చారు. ఉత్తర కొరియా ప్రయోగాలను జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కూడా తప్పపట్టారు.