జోహన్నెస్‌బర్గ్‌లో మారణకాండ.. విచక్షణారహిత కాల్పుల్లో 11 మంది మృతి!

దక్షిణాఫ్రికాలో నెల రోజుల్లోనే ఇలాంటి కాల్పుల ఘటన జరగడం ఇది రెండోసారి. దీనికి ముందు డిసెంబర్ 6న ప్రిటోరియా సమీపంలోని ఒక హాస్టల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా, మూడేళ్ల బాలుడితో సహా 12 మంది మరణించారు.

Published By: HashtagU Telugu Desk
Shooting

Shooting

  • సౌతాఫ్రికాలో మ‌రోసారి మార‌ణ‌కాండ‌
  • విచ‌క్ష‌ణార‌హిత కాల్పుల్లో 11 మంది మృతి
  • నెల రోజుల్లోనే ఇలాంటి కాల్పుల ఘటన జరగడం ఇది రెండోసారి

Shooting: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఘోరమైన దాడి జరిగింది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో దాదాపు 20 మంది తూటాల గాయాలకు గురయ్యారు. వీరిలో 11 మంది మరణించగా, మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండటం అత్యంత విషాదకరం. గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణం ఇంకా తెలియరాలేదు.

బంగారు గనుల సమీపంలోని బస్తీపై దాడి

గౌటెంగ్ ప్రావిన్స్ పోలీసు ప్రతినిధి బ్రిగేడియర్ బ్రెండా మురిడిలి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడి జోహన్నెస్‌బర్గ్ నగరానికి 40 కిలోమీటర్ల (25 మైళ్లు) దూరంలో నైరుతి దిశలో ఉన్న బెకర్స్‌డల్ అనే ప్రాంతంలో జరిగింది. బంగారు గనుల సమీపంలో ఉన్న ఒక చిన్న బస్తీలో నివసించే ప్రజలపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మృతుల గుర్తింపు ఇంకా జరగాల్సి ఉంది. అయితే గాయపడిన వారు తమపై వెనుక నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసులకు తెలిపారు.

Also Read: ప్రియాంక గాంధీ చెప్పిన నీలి ప‌సుపు అంటే ఏమిటి? ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయా?

నెల వ్యవధిలో రెండోసారి కాల్పులు

దక్షిణాఫ్రికాలో నెల రోజుల్లోనే ఇలాంటి కాల్పుల ఘటన జరగడం ఇది రెండోసారి. దీనికి ముందు డిసెంబర్ 6న ప్రిటోరియా సమీపంలోని ఒక హాస్టల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా, మూడేళ్ల బాలుడితో సహా 12 మంది మరణించారు. అక్రమంగా మద్యం విక్రయించే ప్రదేశంలో ఆ కాల్పులు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. 63 మిలియన్ల జనాభా కలిగిన దక్షిణాఫ్రికా, ప్రపంచంలోనే అత్యధిక నేరాల రేటు ఉన్న దేశాల్లో ఒకటిగా ఉంది.

  Last Updated: 21 Dec 2025, 11:58 AM IST