Site icon HashtagU Telugu

Britan Snow : చ‌లి గుప్ప‌ట్లో బ్రిట‌న్‌

Uk Snow

Uk Snow

గతంలో ఎన్నడూ లేనంతంగా వాతావరణంలో విపరీతమైన మార్పులను చవిచూస్తోంది యూకే. (Britan Snow) ఈ ఏడాదిలో చరిత్రలోనే అత్యంత వేసవి పరిస్థితులను చూసింది. వేలమంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు చలి వంతు వచ్చింది.  గడ్డకట్టించే చలి, దుప్పటిలా కప్పేసిన మంచు ప్రభావంతో బ్రిటన్‌ చిగురుటాకులా వణుకుతోంది. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు మైనస్ 10లకు పడిపోవడంతో.. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

ఐస్‌ల్యాండ్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలిపులి పంజా విసురుతోంది. విపరీతంగా కురుస్తున్న మంచుతో రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. ముందున్న వాహనం కూడా కనిపించని పరిస్థితి. హైవేలపై పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. చాలాచోట్ల యజమానులు తమ కార్లను రహదారుల పక్కన వదిలేసి వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

 

మంచు తీవ్రత కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కొన్నిచోట్ల పట్టాలపై మంచు కప్పేయడంతో రైళ్లను పాకిక్షంగా రద్దు చేశారు. ఇక లండన్‌లోని హిత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో 48 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో జనం బారులు తీరారు.కెంట్, ఎస్సెక్స్, లండన్‌లో భారీగా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. లండన్‌ సహా సౌత్, సెంట్రల్‌ ఇంగ్లాండ్‌లో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు వాతావరణ అధికారులు. స్కాట్లాండ్‌లో మైనస్‌ 15 డిగ్రీలు నమోదైంది. దీనికి ఆర్కిటిక్‌ బ్లాస్టే కారణమని నిపుణులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.ఈ ఏడాదిలోనే అత్యంత వేడిమి పరిస్థితులు చూసింది యూకే. ఇప్పుడు దారుణ చలి పరిస్థితులు ఎదుర్కొంటోంది. గ్లోబల్ వార్మింగ్‌, వాతావరణ మార్పులే దీనికి కారణమని ఎన్విరాన్‌మెంటర్ ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు .