Who is Shooter : స్లొవేకియా ప్రధానిపై కాల్పులు.. 71 ఏళ్ల ముసలాయనే షూటర్

స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై బుధవారం మధ్యాహ్నం కాల్పులు జరిగిన ఘటన యావత్ ప్రపంచంలో కలకలం రేపింది.

Published By: HashtagU Telugu Desk
Who Is Shooter

Who Is Shooter

Who is Shooter : స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై బుధవారం మధ్యాహ్నం కాల్పులు జరిగిన ఘటన యావత్ ప్రపంచంలో కలకలం రేపింది. ప్రస్తుతం ప్రధాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఇంతకీ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై ఎందుకు దాడి జరిగింది ?  కాల్పులు జరిపిన 71 ఏళ్ల ముసలాయన(Who is Shooter) ఎవరు ? అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది.

We’re now on WhatsApp. Click to Join

పోలీసుల కథనం ప్రకారం.. ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై కాల్పులు జరిపిన వ్యక్తి స్లొవేకియా దేశంలోని లెవీస్ పట్టణ వాస్తవ్యుడు. అతడు ఒక ఒక రచయిత.  ఇప్పటివరకు మూడు కవితా సంకలనాలను రాశాడు. స్లొవేకియా రచయితల అధికారిక అసోసియేషన్‌లోనూ 2015 సంవత్సరం నుంచి సభ్యుడిగా ఉన్నాడు. అయితే తాజాగా దేశ ప్రధానిపై కాల్పులు జరిపిన నేపథ్యంలో అతడిని స్లొవేకియా రచయితల అధికారిక అసోసియేషన్‌ నుంచి బహిష్కరించారు. ఈవిషయాన్ని ఫేస్‌బుక్ వేదికగా అసోసియేషన్ వెల్లడించింది. ప్రధానిపై కాల్పులు జరిపిన వ్యక్తి తాను నివసించే లెవీస్ పట్టణంలో DUHA (రెయిన్‌బో) లిటరరీ క్లబ్‌‌ అనే సంస్థను నడుపుతున్నాడు.  71 ఏళ్ల ఆగంతకుడు గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో విభిన్న రకాల పోస్టులు చేశాడు. ‘‘ప్రపంచం హింస, ఆయుధాలతో నిండిపోయింది. ప్రజలు వెర్రితలలు వేస్తున్నారు’’ అని ఓ పోస్టులో షూటర్ వ్యాఖ్యానించాడు. ఈ షూటర్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. స్లొవేకియా సహా యూరోపియన్ దేశాల ఇమ్మిగ్రేషన్ విధానాన్ని వ్యతిరేకించాడు. దేశంలో విద్వేషం, తీవ్రవాదం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. యూరోపియన్ దేశాలలో పెరిగిపోతున్న అనిశ్చితికి ప్రత్యామ్నాయం కనిపించడం లేదని కామెంట్స్ పెట్టాడు. DUHA (రెయిన్‌బో) లిటరరీ క్లబ్‌‌ పేరుతో  తాను లెవీస్‌లో హింసకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మొదలుపెట్టినట్లు ఆ వీడియోలో 71 ఏళ్ల షూటర్ ప్రస్తావించాడు. ఐరోపాదేశాల్లో హింస, విద్వేషాన్ని అరికట్టడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని చెప్పుకొచ్చాడు. తమ సంస్థను అభివృద్ధి చెందుతున్న రాజకీయ పార్టీగా అభివర్ణించాడు.

Also Read :Hyderabad – June 2 : జూన్ 2 నుంచి తెలంగాణదే హైదరాబాద్.. సీఎం రేవంత్ కసరత్తు

సదరు షూటర్ కుమారుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా నాన్న ఎందుకలా చేశారో నాకు అర్థం కావడం లేదు. నాన్న దగ్గర ఒక రిజిస్టర్డ్ తుపాకీ ఉంది. ప్రధాని ఫికోపై కోపంతో నాన్న ఉండేవారు. ఆయనకు ఓటు వేసేవారు కాదు. అక్కడి వరకే నాకు తెలుసు. మరేమీ తెలియదు’’ అని వెల్లడించారు.  ఇక ప్రధానిపై కాల్పులు జరిగిన వ్యక్తి వివరాలను స్లొవేకియా హోం శాఖ మంత్రి మాటస్ సుతాజ్ ఎస్టోక్ కూడా ధ్రువీకరించారు.

Also Read :National Dengue Day : డెంగ్యూ లక్షణాలు, చికిత్స, నివారణ చర్యలు ..!

  Last Updated: 16 May 2024, 08:49 AM IST