అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇంటి నుంచి రహస్య పత్రాలు లభ్యం అయ్యే విషయంలో బైడెన్ కు ఇబ్బందులు తగ్గేలా కనిపించడం లేదు. జో బైడెన్ ఇంటిపై మరోసారి సోదాలు జరిగాయి. US న్యాయ శాఖ సోదాల సమయంలో బైడెన్ ఇంటి నుండి మరో ఆరు రహస్య పత్రాలు లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని బైడెన్ వ్యక్తిగత న్యాయవాది బాబ్ బాయర్ ధృవీకరించారు. దాదాపు 12 గంటల పాటు శోధన కొనసాగిందని న్యాయవాది బాబ్ బాయర్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ నివాసంలో రహస్య పత్రాలు లభ్యం కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
బైడెన్ న్యాయవాది ప్రకారం.. శుక్రవారం న్యాయ శాఖ అధికారులు రహస్య పత్రాల కోసం వెతకడానికి డెలావేర్‌లోని జో బైడెన్ ఇంటిపై, విల్మింగ్టన్‌లోని మాజీ కార్యాలయంపై దాడి చేశారు. జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న కాలం నాటి రహస్య పత్రాలు, పదవిని వదులుకునే ముందు తన వద్ద ఉన్న రహస్య పత్రాలను తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read: Indian Cricketer: స్నేహితుడి చేతిలో మోసపోయిన టీమిండియా క్రికెటర్
అదే సమయంలో దర్యాప్తుకు సంబంధించి నవంబర్‌లో తన వ్యక్తిగత కార్యాలయంలో రహస్య పత్రాలు కనుగొనబడటానికి ముందు వాటిని బహిర్గతం చేయనందుకు తాను చింతిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. మేము పూర్తిగా సహకరిస్తున్నాము. దీనిని త్వరగా పరిష్కరించడానికి ఎదురుచూస్తున్నామని అన్నారాయన. అక్కడ ఏమీ లేదని మీరు కనుగొంటారని నేను భావిస్తున్నాను. నాకేమీ విచారం లేదు. లాయర్లు చెప్పిన దానిని పాటిస్తున్నాను. పరిణామాలు వెలుగులోకి వచ్చిన దాదాపు ఒక వారం తర్వాత అతని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదంతా నన్ను ట్రాప్ చేయడానికి చేశారని, అందులో ఎలాంటి ఆధారాలు లేవని తెలిసి లైట్ తీసుకుంటున్నాను. నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఇదంతా నాకు వ్యతిరేకంగా పన్నిన పథకం అని బైడెన్ అన్నారు. జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న 2009 నుండి 2016 వరకు అతని వ్యక్తిగత కార్యాలయం నుండి ఈ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.