1990ల్లో సెన్సేషనల్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న అమెరికన్ సింగర్ ఆరోన్ కాగ్టర్ (34) మృతి చెందాడు. కాలిఫోర్నియాలోని తన ఇంట్లో బాత్‌టబ్‌లో శవమై కనిపించాడు. “ఐ వాంట్ కాండీ’ వంటి హిట్ ఆల్బమ్స్‌తో టీనేజ్ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతడు సింగర్ మాత్రమే కాదు నటుడు కూడా. కాలిఫోర్నియాలోని లాంకాస్టర్‌లోని అతని నివాసంలో బాత్ టబ్‌లో చనిపోయాడని ఎంటర్‌టైన్‌మెంట్ అవుట్‌లెట్ పేర్కొంది. ఈ విషయం తెలిసిన అధికారులు కార్టర్ ఇంటికి వెళ్లి మృతదేహాన్ని కనుగొన్నారని, అయితే ఆ వ్యక్తిని ఇంకా గుర్తించలేదని పోలీసు ప్రతినిధి తెలిపారు. అయితే కార్టర్ మేనేజర్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు వెంటనే స్పందించలేకపోయాడని సమాచారం.
ఆరోన్ కాగ్టర్ ఫ్లోరిడాలోని టంపాలో డిసెంబర్ 7, 1987న జన్మించాడు. ఏడేళ్ల వయసులోనే ప్రదర్శనలు ప్రారంభించాడు. 1997లో తొమ్మిదేళ్ల వయసులో తన తొలి ఆల్బమ్‌ను విడుదల చేశాడు ఆరోన్ కాగ్టర్. అయితే అతని వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. కార్టర్.. ఐదుగురు తోబుట్టువుల మధ్య స్పష్టమైన కలహాలు, డబ్బు కోసం కుటుంబంతో తగాదాలు ఉన్నాయి. ఆరోన్ కార్టర్ మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.