World War ll Bomb: సింగపూర్‌లో బాంబు కలకలం రేపింది. సింగపూర్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబును గుర్తించారు. బాంబు నిర్వీర్య నిపుణులు 100 కిలోల బరువున్న బాంబును విజయవంతంగా నిర్వీర్యం చేశారు. వార్తా సంస్థ రాయిటర్స్ వివరాల ప్రకారం, బాంబు నిర్వీర్య బృందం బాంబును నిర్వీర్యం చేయడానికి ముందు సుమారు నాలుగు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీని తర్వాత 100 కిలోల బరువున్న బాంబును విజయవంతంగా నిర్వీర్యం చేశారు. బాంబును నిర్వీర్యం చేస్తున్న వీడియోను కూడా సింగపూర్ ఆర్మీ షేర్ చేసింది. బాంబును నిర్వీర్యం చేయగా దట్టమైన పొగ దూరంగా వ్యాపించినట్లు వీడియోలో కనిపిస్తోంది. 100 కిలోల బరువున్న ఈ బాంబు సింగపూర్ నగరంలో కనుగొన్న అతిపెద్ద పేలుడు పదార్థాలలో ఒకటిగా భావిస్తున్నారు. ఈ బాంబు విషయంలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సైన్యం సహాయంతో 100 కిలోల బరువున్న బాంబును నిర్వీర్యం చేశారు.బాంబును నిర్వీర్యం చేసిన ప్రజలను ఆ ప్రాంతానికి అనుమతించినట్లు పోలీసులు తెలిపారు.2016లోను అక్కడ 100 కిలోల బాంబును గుర్తించారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటిది. అయితే అది కూడా తర్వాత నిర్వర్యం అయింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సింగపూర్ 1942 నుండి 1945 వరకు జపనీయులచే ఆక్రమించబడిన విషయం తెలిసిందే.
Also Read: Cauvery Water Sharing Issue : సీఎం సిద్ధరామయ్య, సీఎం స్టాలిన్‌కు అంతిమ సంస్కారం