Emergency Landing: విమానం ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌.. ఒక‌రి మృతి, 30 మందికి గాయాలు..!

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బ్యాంకాక్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Indian Aviation History

Indian Aviation History

Emergency Landing: సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బ్యాంకాక్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ (Emergency Landing) చేయాల్సి వచ్చింది. ఈ విమానం లండన్ నుంచి బయలుదేరింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడు మరణించగా, 30 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ఈ విమానం బోయింగ్ 777-330ER విమానం. నివేదికల ప్రకారం.. విమానంలో 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉన్నారు. ఈ విమానం లండన్ నుంచి సింగపూర్ వెళ్తోంది. ఈ ఘటనను విమానయాన సంస్థ ధృవీకరించింది. నివేదికల ప్రకారం.. విమానం కేవలం 5 నిమిషాల్లో 6000 అడుగులు దిగింది.

సోమవారం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు వెళ్లేందుకు SQ321 నంబర్ ఫ్లైట్ టేకాఫ్ అయినట్లు ఎయిర్‌లైన్స్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కానీ దారిలో తీవ్ర గందరగోళాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ కారణంగా బ్యాంకాక్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించబడింది. అక్కడ మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. అయితే ఈ ఘ‌ట‌నలో ఒక వ్య‌క్తి మ‌ర‌ణించాడు. మృతుని కుటుంబానికి విమానయాన సంస్థ సంతాపం తెలిపింది.

Also Read: New Driving License Rules: ఇక‌పై ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్.. జూన్ 1 నుంచి కొత్త నిబంధ‌న‌లు..!

విమానయాన సంస్థ తన బృందాన్ని బ్యాంకాక్‌కు పంపుతోంది

విమానంలో ఒక ప్రయాణికుడు మరణించడం, కొంతమంది గాయపడినట్లు ధృవీకరిస్తున్నాము అని విమానాయ‌న సంస్థ‌ ప్రకటన పేర్కొంది. ప్రయాణీకులు, సిబ్బంది సభ్యులందరికీ సాధ్యమైన సహాయాన్ని అందించడం మా ప్రాధాన్యత. ప్రయాణీకులకు, సిబ్బందికి అవసరమైన వైద్య సహాయం అందించడానికి మేము థాయ్‌లాండ్‌లోని స్థానిక అధికారులతో కలిసి పని చేస్తున్నాము. బ్యాంకాక్‌కి ఒక బృందాన్ని పంపుతున్నాము. ఆ బృందం అన్ని రకాల అదనపు సహాయాన్ని అందించడానికి పని చేస్తుందని సంస్థ పేర్కొంది.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 21 May 2024, 07:53 PM IST