Gold Mine Dispute: పపువా న్యూగినియా దేశంలో వివిధ తెగల మధ్య తరుచుగా ఘర్షణలు జరుగుతుంటాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఘర్షణ అత్యంత విలువైన బంగారు గనితో ముడిపడినది. ఈ దేశంలో ఉన్న పోర్‌గెరా బంగారు గని స్థలాన్ని ఈ ఏడాది ఆగస్టులో సకార్ తెగకు(Gold Mine Dispute) చెందిన పలువురు కబ్జా చేశారు.
Also Read :Kolkata Horror : లై డిటెక్టర్ పరీక్షలో మాజీ ప్రిన్సిపల్ డొంక తిరుగుడు ఆన్సర్స్ : సీబీఐ
వాస్తవానికి ఈ స్థలంపై పయాండె తెగకు చెందిన ప్రజలకు ఉన్నాయి. అయినా వాటిని సకార్ తెగ ప్రజలు బేఖాతరు చేశారు. దీంతో పోర్‌గెరా బంగారు గని స్థలం విషయంలో సకార్, పయాండె తెగ ప్రజల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆదివారం రోజు ఇరు వర్గాల మధ్య దాదాపు 3,00కుపైగా రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 30 మంది చనిపోగా, పదుల సంఖ్యలో గాయాలపాలై ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యారు. చనిపోయిన వారి సంఖ్య 50కి పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. గాయపడిన వారి సంఖ్యపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు.
Also Read :Jani Master : జనసేన పార్టీకి దూరంగా ఉండాలి.. జానీ మాస్టర్ కి పార్టీ ఆదేశాలు..
కొసమెరుపు ఏమిటంటే.. ఈ బంగారు గని స్థలం పపువా న్యూగినియాకు చెందిన పయాండె తెగకు చెందినవారిదే. అయితే అక్కడ నిర్వహిస్తున్న బంగారు గని యజమాని ఒక కెనడా జాతీయుడు. ఈ ఘర్షణల నేపథ్యంలో అభద్రతకు లోనైన సదరు వ్యక్తి.. గనిలో కార్యకలాపాలను తాత్కాలికంగా ఆపేస్తున్న ప్రకటించాడు. ఇక ఈ అల్లర్ల క్రమంలో నిరసనకారులు ప్రభుత్వ ఆఫీసులు, ఆస్పత్రులను మూసివేయించారు. ఇళ్లకు నిప్పుపెట్టారు. ఈనేపథ్యంలో ఆయుధాలు చేతిలో ఉన్నవారిని కాల్చి పారేస్తామని స్థానిక పోలీసులు ప్రకటించారు. ఈమేరకు పోలీసులకు ప్రత్యేక అధికారాలను కట్టబెడుతూ పపువా న్యూగినియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మద్యం మత్తులో ఆందోళనకారులు దురాగతాలకు దిగొచ్చనే భయంతో ఆల్కహాల్ విక్రయాలను కూడా సర్కారు ఆపేసింది. రాత్రివేళల్లో కర్ఫ్యూ అమలవుతుందని తెలిపింది. కాగా, 2022 సంవత్సరంలోనూ ఇదే బంగారు గని వద్ద తెగల మధ్య ఘర్షణల్లో దాదాపు 15 మంది చనిపోయారు.