Site icon HashtagU Telugu

Thailand : థాయిలాండ్ ప్రీస్కూల్ లో కాల్పులు..32 మంది చిన్నారులు మృతి..!!

Thailand

Thailand

థాయిలాండ్ లోని ఓ ప్రీస్కూల్ దగ్గర గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 32మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో అత్యధికంగా చిన్నారులే ఉన్నారు.నిందితుడు తన బిడ్డను, భార్యను కూడా కాల్చాడు. ఈ ఘటన దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని నాక్లాంగ్ జిల్లాలో జరిగింది. కాల్పులు చేసిన దుండగుడు అక్కణ్నుంచి పరారయ్యాడు. పోలీసులు అతడికోసం గాలింపు చేపట్టారు.

కాగా నిందితుడిని ఖమ్రాప్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. అతను మాజీ పోలీసు అధికారి. అతన్ని గతేడాది క్రితం విధుల నుంచి తొలగించారని తెలిపారు. అప్పట్లో అతను డ్రగ్స్ వాడినట్లు తేలడంతో విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు. ఈ కేసులో శుక్రవారం కోర్టు విచారణకు హాజరుకావాల్సిన నేపథ్యంలో ఈ కాల్పులు కలకలం రేపాయి. కాల్పులకు పాల్పడిన తర్వాత అతను బ్యాంకాక్ రిజిస్ట్రేషన్ ఉన్న ఫోర్ డోర్ వీగో పికప్ ట్రక్ ఎక్కిపారిపోయాడు.