Site icon HashtagU Telugu

Pakistan: పాకిస్థాన్‌లో రైలులో అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారులతో సహా ఏడుగురు మృతి

Pakistan

Resizeimagesize (1280 X 720) (1)

పొరుగు దేశమైన పాకిస్థాన్‌ (Pakistan)లోని ఓ ప్యాసింజర్ రైలులో మంటలు (Train Fire) చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న పలువురు కాలిపోయి మృత్యువాత పడ్డారు. సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలతో సహా కనీసం ఏడుగురు మరణించారు. ఈ సమాచారాన్ని పాకిస్థాన్ రైల్వేస్ గురువారం (ఏప్రిల్ 27) అందించింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ పాకిస్థాన్‌లోని కరాచీకి ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలోని ఖైర్‌పూర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండిన ఈ ప్యాసింజర్ రైలు తూర్పు నగరం లాహోర్ వైపు వెళుతోంది.

గ్యాస్ స్టవ్ కారణంగా మంటలు..?

ప్యాసింజర్ రైలులోని మంటలు రైలులోని అనేక ఇతర కోచ్‌లను చుట్టుముట్టాయి. ఒక టీవీ ఛానెల్ ఫుటేజీలో రైలులోని అనేక కాలిపోయిన భాగాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల ఎంతమేర ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. బుధవారం (ఏప్రిల్ 26) రాత్రి రైలులో మంటలు చెలరేగాయని స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదానికి గ్యాస్‌ స్టవ్‌ కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. పాకిస్తాన్‌లోని పేద ప్రయాణీకులు తరచూ తమ సొంత చిన్న గ్యాస్ స్టవ్‌లను రైళ్లలో వంట కోసం తీసుకువస్తుంటారు. రద్దీగా ఉండే రైళ్లలో భద్రతా నియమాలు తరచుగా విస్మరించబడుతున్నాయి.

Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి బాంబ్ బెదిరింపు.. 60 ఏళ్ల నిందితుడు అరెస్టు

దేశంలో సరైన రైల్వే మౌలిక సదుపాయాలు లేకపోవటం, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని రిటైర్డ్ రైల్వే అధికారులు చెబుతున్నారు. 2019లో తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో వంట గ్యాస్ స్టవ్ పేలడంతో రైలులో మంటలు చెలరేగాయి. ఇందులో కనీసం 74 మంది ప్రయాణికులు మరణించారు. డజన్ల కొద్దీ ప్రయాణికులు గాయపడ్డారు.